జగన్ కేబినెట్ భేటీ-సాధారణ, వ్యవసాయ బడ్జెట్ లకు ఆమోదముద్ర-బుగ్గన కామెంట్స్..

ఏపీలో ఇవాళ రాష్ట్ర సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తరఫున వరుసగా నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సాధారణ బడ్డెట్ తో పాటు వ్యవసాయ బడ్డెట్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బడ్దెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్ధికమంత్రి బుగ్గన బడ్డెట్ ఎలా ఉంటుందో చెప్పేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో బడ్డెట్ ప్రవేశపెట్టాల్సిన తరుణంలో ఇవాళ ఉదయం సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రెండు బడ్డెట్ లకు ఆమోదముద్ర వేసింది. ఇందులో రాష్ట్ర సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బడ్డెట్ ప్రతులకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు అధికారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

jagan cabinet approves general and agriculture budgets-fm buggana key comments
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ ఉండబోతోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసన సభలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సచివాలయంలోని తన కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులను స్వామి చిత్రపటం వద్ద ఉంచి ఆయన పూజ నిర్వహించారు. అనంతరం ఆయన వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.
jagan cabinet approves general and agriculture budgets-fm buggana key comments

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో 2023-24 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైనట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

jagan cabinet approves general and agriculture budgets-fm buggana key comments

మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+