వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్: ఏపీ కేబినేట్ పై యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ది చాయ్ బిస్కెట్ క్యాబినెట్ అని, ఇంతకు ముందు ఏపీ లో ఉంది పప్పెట్ క్యాబినెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ క్యాబినెట్ లో మంత్రులకు స్వేచ్ఛ లేదని పేర్కొన్న యనమల రామకృష్ణుడు ప్రజల్లో వైసిపి పట్ల నెగిటివిటీ ఉందని, అందుకే పార్టీలో కొంతమంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

వైయస్ జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు: లోకేష్ ఫైర్వైయస్ జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు: లోకేష్ ఫైర్

జగన్ కిచెన్ క్యాబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత లేదు

జగన్ కిచెన్ క్యాబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత లేదు


వైసీపీలో అసంతృప్తి మొదలైందని పేర్కొన్న యనమల, పార్టీలో ఒత్తిళ్లకు జగన్ లొంగక తప్పని పరిస్థితి వస్తుందని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జగన్ కిచెన్ క్యాబినెట్ లో, సలహాదారుల బృందంలోనూ బీసీలు ఎందుకు లేరని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రాధాన్యత లేని పదవులను ఇచ్చి ప్రాతినిథ్యం కల్పించామని ఎలా చెబుతారు అంటూ యనమల రామకృష్ణుడు నిలదీశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అని ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు

సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అని ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు


ఈ క్యాబినెట్ లో బడుగులకు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొన్న యనమల బడుగులకు ఎంతమందికి చోటుకల్పించారు అనేదానికంటే ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు అనేదే ముఖ్యమని పేర్కొన్నారు. జగన్ క్యాబినెట్ లో పాత బిసి, ఎస్సీ, ఎస్టీలను తీసేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యంతో పాటు ప్రాధాన్యత కూడా వచ్చిందని యనమల రామకృష్ణుడు గుర్తుచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అని ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు సీఎం సన్నిహితుడు అయితే మంత్రులను కూడా డిక్టేట్ చేస్తారా అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాబినెట్ లో ఎవరికీ పవర్ లేదని ఎద్దేవా

క్యాబినెట్ లో ఎవరికీ పవర్ లేదని ఎద్దేవా


జగన్ డెమోక్రటిక్ డిక్టేటర్ అంటూ యనమల విమర్శించారు. జగన్ క్యాబినెట్ చాయ్ బిస్కెట్ క్యాబినెట్ అంటూ పేర్కొన్న యనమల క్యాబినెట్ లో ఎవరికీ పవర్ లేదని ఎద్దేవా చేశారు. పవర్ మనీ రెండూ జగన్ వద్దే ఉన్నాయంటూ యనమల పేర్కొన్నారు. ఇక క్యాబినెట్లో బీసీలు ఉండాలి కాబట్టి, బీసీలకు పదవి ఇస్తున్నారు కానీ ఆ పదవులకు ప్రాధాన్యత లేదని యనమల పేర్కొన్నారు.

వైసిపిలో అసంతృప్తి మొదలైంది

వైసిపిలో అసంతృప్తి మొదలైంది


చంద్రబాబు తమలాంటి వారితో సంప్రదింపులు జరిపే వారని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకునే వారని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. టిడిపి పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యం వచ్చిందన్న విషయాన్ని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. జగన్ మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరితో సంప్రదింపులు జరపడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ మండిపడ్డారు. వైసిపిలో అసంతృప్తి మొదలైందని పేర్కొన్న యనమల, జగన్ పై తిరుగుబాటు జరుగుతుందని ఇటీవల జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతుందని స్పష్టం చేశారు.

English summary
Yanamala Ramakrishnudu made interesting remarks on the AP cabinet that Jagan cabinet is a Chai biscuit cabinet. before Puppet Cabinet has been in the AP , he said. Jagan claimed that there was no freedom for ministers in the cabinet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X