దళితులపై...జగన్ మాటలకు నవ్వొస్తోంది;వాళ్లను దోచుకున్నారు:మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు: దళితులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
టిడిపి పాలనలో దళితుల సంక్షేమంపై చర్చకు జగన్ సిద్ధమా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.
గుంటూరులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇడుపులపాయలో దళితుల భూములను దోచుకున్నవారే మళ్లీ దళితులపై ప్రేమను కురిపించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. దళితులను వైయస్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు.

దళితుల భూముల్లోనే రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సమాధులు నిర్మించారన్నారు. అసెంబ్లీలో దళితుల భూములు తిరిగిస్తానని వైఎస్ చెప్పిన మాట ఏమైందని మంత్రి నక్కా ఆనందబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. దళితుల దోపిడి చేసి బతికే కుటుంబమే వైఎస్ కుటుంబమన్నారు. వైఎస్ కుటుంబం అంతా దళిత ద్రోహులన్నారు. దళితుల సంక్షేమం కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దోపిడిదారుడు ,దుర్మార్గుడైన వైఎస్ విగ్రహాన్నిఅంబేద్కర్ విగ్రహం పక్కన పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు దమ్ముంటే దళితుల సంక్షేమం పై బహిరంగ చర్చకు రావాలని మంత్రి నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications