జ‌మ్మ‌ల‌మడుగు వెళ్ల‌ట‌మే ఆయ‌న చేసిన పాపం : నాన్న మ‌ర‌ణం పైనా : జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

వైయ‌స్ వివేకానం రెడ్డి హ‌త్య పై సిబిఐ విచార‌ణ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. వివేకా హత్య ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు తోటే జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగే విచార‌ణ తో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. జ‌మ్మ‌ల‌డుగు ఇన్‌ఛార్జ్‌గా ఉండ‌ట‌మే ఆయ‌న చేసిన త‌ప్ప‌ని..అందుకే హ‌త్య చేసార ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

జ‌మ్మ‌లమడుగు వెళ్ల‌ట‌మే ఆయ‌న చేసిన పాపం..

జ‌మ్మ‌లమడుగు వెళ్ల‌ట‌మే ఆయ‌న చేసిన పాపం..

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త అభ్య‌ర్ధి సుధీర్ రెడ్డికి మ‌ద్ద‌తుగా వివేకానంద రెడ్డి అక్క‌డ‌కు వెళ్లారని అదే వివేకా చేసిన త‌ప్ప‌ని..అందుకే హ‌త్య‌కు గుర‌య్యార‌ని వైసిపి అధినేత జ‌గ‌న్ ఆరోపించారు. వివేకానంద రెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇన్‌ఛార్జ్ గా ఉన్నార‌ని అక్క‌డ ఆయ‌న తిర‌గ‌ట‌మే చేసిన పాప‌మైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. త‌మ పార్టీ నుండి గెలి చిన ఆదినారాయ‌ణ రెడ్డి టిడిపికి అమ్ముడుపోయి మంత్రి అయ్యార‌ని..ఆయ‌న పోటీ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇంట్లో ఒక్క‌డే ఉంటున్నాడ‌ని తెలిసి ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం హ‌త్య చేయించార‌ని ఆరోపించారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మం త్రి సోద‌రుడ‌ని.. సౌమ్యుడ‌ని..ఎవ‌రి తో గొడ‌వ‌లు లేవ‌ని..క‌నీసం సెక్యూరిటీ కూడా ఉండ‌దని జ‌గ‌న్ వివ‌రించారు. అటు వంటి వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేయ‌టం దుర్మార్గ‌మ‌న్నారు.

సిబిఐ విచార‌ణకు అందుకే ఇవ్వ‌ట్లేదు..

సిబిఐ విచార‌ణకు అందుకే ఇవ్వ‌ట్లేదు..

తాము ఈ హ‌త్య‌ల గురించి ముఖ్య‌మంత్రి పైనే ఆరోప‌ణ‌లు చేస్తున్నామ‌ని..ఆయ‌న అజ‌మాయిషీలో ప‌ని చేసే పోలీసు అధికారుల పై న‌మ్మ‌కం లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి ప్ర‌మేయం లేక‌పోతే సిబిఐ విచార‌ణ‌కు ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. క‌డ‌ప జిల్లాలో రెండేళ్లు పూర్తి కాకుండానే ఎస్పీని మార్చి..40 రోజుల క్రితం ప్ర‌స్తుత ఎస్పీ ని తీసుకొచ్చార‌ని గుర్తు చేసారు. ఏపిలో నిఘా వ్య‌వ‌స్థ పూర్తి గా చంద్ర‌బాబుకు వాచ్‌మెన్ వ్య‌వ‌స్థ‌గా మారింద‌ని దుయ్య‌బ ట్టారు. వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని ఏబి వేంక‌టేశ్వ‌ర రావు..ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ రేటు ఫిక్స్ చేసి కండువాలు మార్పించార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల విధుల నుండి డిజిపి..నిఘా ఏడిజి ని త‌ప్పించాల ని గ‌వ‌ర్న‌ర్ ను కోరిన‌ట్లు చెప్పారు.

 నాన్న మ‌ర‌ణంలోనూ అనుమానాలు..

నాన్న మ‌ర‌ణంలోనూ అనుమానాలు..

త‌న తాత రాజారెడ్డి సైతం చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే హ‌త్య‌కు గుర‌య్యార‌ని పేర్కొన్నారు. ప్ర తిప‌క్ష నేత తండ్రిని హ‌త‌మార్చారన్నారు. శాస‌న‌స‌భ లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు నాటి ముఖ్య‌మంత్రి వై య‌స్ ను ఉద్దేశించి ఎవ‌రు ఫినిష్ అవుతారో చూద్దామంటూ హెచ్చ‌రించార‌ని..ఆ త‌రువాత రెండు రోజుల‌కే వైయ‌స్ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని..దాని పైనా త‌మ‌కు అనుమానాలు ఉన్నాయ‌న్నారు. త‌న‌పైనా విమానాశ్ర యం లో హ‌త్యా య‌త్నం జ‌రిగింద‌ని గుర్తు చేసారు. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి లెట‌ర్ ఎలా రాస్తార‌ని నిల‌దీసారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం హ‌త్య చేసి స‌హ‌జ మ‌ర‌ణంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ సిబిఐకి ఇవ్వ‌క‌పోతే రెండు రోజులు వేచి చూసి కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+