వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు వైయస్ జగన్ పరిష్కారం: వదిలేయాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరిష్కారం చూపించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణను అభివృద్ది చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఆయన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ఎకనమిక్ టైమ్స్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

తాను తెలంగాణ ప్రజలను కలుస్తానని, తెలంగాణ అభివృద్ధికి ఏం చేయాలో అది చేస్తానని హామీ ఇస్తానని ఆయన అన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదని, పరిష్కారాలు లభించిన అంశాలను యథాతథంగా వదిలేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని స్పృశించకపోవడం మంచిదని జగన్ అన్నారు.

YS Jagan

ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చెప్పడం వల్ల ఉపసంహరించుకున్నప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదని ఆయన అన్నారు. విభజన నిర్ణయం మంత్రి వర్గం ఆమోద దశలోనే ఉందని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ మనోభావాలతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా గాంధీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన ఈ నెల 5వ తేదీన విమర్శించారు.

English summary
Jagan Mohan Reddy, who is well-known as Jagan, seems to have found one solution for Telangana crisis. The YSR Congress President claimed that the region's development is possible without creating a new state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X