వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2024..బాబు సై సెటైర్లు : పూర్తి ప్ర‌క్షాళ‌న చూస్తారు..ఎమ్మెల్యేల‌కు కొత్త బాధ్య‌త‌: జ‌గ‌న్

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల్లో గెలిచి రెండు రోజుల‌కే జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌కు కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మ‌న మీద న‌మ్మ‌కంతో ఓట్లు వేసార‌ని..విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకుంటూ..మ‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకుంటూ 2024 ఎన్నిక‌ల్లో ఇంత క‌న్నా ఎక్కువ‌గా గెల‌వాల‌ని సూచించారు. రాజ‌కీయాల్లో పూర్తి ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని..దేశం మొత్తం ఏపీ వైపు చేసేలా చేస్తాన‌న్నారు. ఎమ్మెల్యేలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.

మ‌న స‌మర్థ‌త నిరూపించుకుందాం..

మ‌న స‌మర్థ‌త నిరూపించుకుందాం..

ప్ర‌జ‌లు మ‌న‌కు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియెగం చేసుకొని..మ‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకుందామ‌ని జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు పిలుపునిచ్చారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని... తొమ్మిదేళ్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామ‌నే విషయాన్ని గుర్తు చేసారు. ప్రజలు మన పార్టీపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. 151 అసెంబ్లీ,22 ఎంపీ స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేయ‌టం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు.

చంద్ర‌బాబు పైన సెటైర్లు..

చంద్ర‌బాబు పైన సెటైర్లు..

అన్యాయం చేస్తే, అధర్మం చే స్తే దేవుడు ఏవిధంగా చేస్తాడో చంద్రబాబును చూస్తే తెలుస్తోందన్నారు. వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు కొన్నారని... అదే సంఖ్యను ఇప్పుడు దేవుడు చంద్రబాబుకు ఇచ్చారన్నారు. ఎంపీల సంఖ్య మూడు..కరెక్ట్‌గా జరిగిందిని వ్యాఖ్యానించారు. అది కూడా మే 23వ తేదీ జరిగిందన్నారు. ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారుని.. వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు. టార్గెట్‌ 2024 ఎన్నికలే లక్ష్యంగా ప‌ని చేయాల‌న్నారు. ఈ విజ‌యం జ‌గ‌న్ ఒక్క‌డిదే కాద‌ని..ఇందులో ప్ర‌తీ ఒక్క‌రి భాగస్వామ్యం ఉంద‌న్నారు. మీ అంద‌రూ స‌హ‌క‌రించారు కాబ‌ట్టే జ‌గ‌న్ గెలిచాడ‌ని వివ‌రించారు.

 దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తా..

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తా..

రాజ‌కీయాల‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని..దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఖ‌చ్చితంగా చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌కించారు. దీనికి మీరంతా స‌హ‌క‌రించాల‌ని ఎమ్మెల్యేల‌ను కోరారు. జ‌గ‌న్ మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకోవాల‌నేదే త‌న లక్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేసారు. పాల‌న‌లోనూ భారీ సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉన్నాయ‌ని..ఆ విష‌యం మ‌ర్చిపోకుండా ప్ర‌తీ ఎమ్మెల్యే ప్ర‌తీ చోట పార్టీని గెలిపించాల‌ని నిర్దేశించారు. ప్ర‌జ‌లు మ‌న విశ్వ‌స‌నీయ‌త‌కు ఓటు వేసార‌ని..దీనిని నిరూపించుకోవాల్సిన బాధ్య‌త మ‌న పైనే ఉంద‌న్నారు.

English summary
YS Jagan elected as YCPLP leader unanimously. He suggested mla's to work with team spirit in future. Jagan says he will surely modify the administration and politics in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X