చంద్రబాబు మెడకు మరో స్కాం ? ఈసారి మైనార్టీ మంత్రిగా- తీగలాగుతున్న సర్కార్....
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీస్తున్న వైసీపీ సర్కారు ఈసారి నేరుగా చంద్రబాబు లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్వంలో చివరి మూడు నెలలు మినహాయిస్తే మిగతా కాలం మైనార్టీ శాఖను తనవద్దే ఉంచుకున్న చంద్రబాబును అందులో జరిగిన ఓ స్కామ్ లో పకడ్బందీగా ఫిక్స్ చేసేందుకు ఆధారాలు సేకరిస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మైనార్టీ మంత్రిగా చంద్రబాబు...
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ తరపున ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరూ గెలవకపోవడంతో వైసీపీ నుంచి జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ బాషా వంటి వారిని అరువు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరికీ మంత్రి పదవి ఇవ్వకుండా చివరి నిమిషం వరకూ ఊరించిన చంద్రబాబు... నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ కు అవకాశం కల్పించారు. అయితే అప్పటికే నాలుగున్నరేళ్లకు పైగా మైనారిటీ శాఖను తన వద్దే ఉంచుకున్న చంద్రబాబును... ఆ శాఖలో చోటు చేసుకున్న ఓ స్కాంలో దోషిగా నిరూపించేందుకు వైసీపీ సర్కారు పావులు కదుపుతోంది.

వక్ఫ్ బోర్డ్ వెబ్ సైట్ నిర్వహణకు కోటి...
ఏపీలో మైనార్టీ వ్యవహారాలశాఖలో భాగమైన వక్ఫ్ బోర్డ్ కు ఓ వెబ్ సైట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే టీడీపీ హయాంలో దానికి మార్పులు చేర్పులు చేసి నిర్వహణ కాంట్రాక్టు అప్పగించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వక్ప్ బోర్డుతో పాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని మైనార్టీ శాఖలో పనిచేస్తున్న కొందరు పావులు కదిపారు. వక్ఫ్ బోర్డు సీఈవోగా ఉన్న అబ్దుల్ ఖాదర్ ఆదేశాల మేరకు వెబ్ సైట్ నిర్వహణకు ఏడాదికి కోటీ పది లక్షల రూపాయల మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అసాధారణ నిర్వహణ ఫీజు...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ కార్పోరేట్ వెబ్ సైట్ల నిర్వహణకు కూడా ఏడాదికి కోటీ పది లక్షల మొత్తాన్ని ఏ సంస్ధ నిర్వహణ ఫీజుగా తీసుకోవడం లేదు. వాస్తవానికి అఫ్పట్లో వెబ్‌సైట్ నిర్వహణకు మూడు నాలుగు లక్షలు ఇచ్చేవారు. అయితే టీడీపీ హయాంలో మాత్రం ఏకంగా కోటి పది లక్షలు కేటాయిస్తూ సి.ఇ.వో. ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైనార్టీ సంక్షేమశాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కనీసం గెజిటెడ్ ఆఫీసర్ హోదా కూడా లేని వ్యక్తి వక్ప్ బోర్డులో సి.ఇ.వో.గా వున్నారు. చట్ట ప్రకారం డిప్యూటీ సెక్రటరీ ర్యాంక్ వున్న అధికారి సి.ఇ.వోగా ఉండాలి. కానీ ఎలాంటి అర్హతలు లేని వ్యక్తిని సీఈవోగా నియమించి వెబ్ సైట్ పోరుతో కోటి రూపాయల మొత్తాన్ని కాజేశారు.
Recommended Video

చంద్రబాబు పాత్రపై ?
అయితే ఈ వ్యవహారం అప్పట్లో మైనార్టీ మంత్రి కమ్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్న చంద్రబాబుకు తెలిసి జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే ఏడాదికి కోటి పది లక్షల చొప్పున పదేళ్లపాటు కాంట్రాక్టు ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే వైసీపీ సర్కారు కాంట్రాక్టు రద్దుతో పాటు చంద్రబాబును ఇరికించేందుకు సిద్దమవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించడంతో పాటు వివరాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రన్న కానుక పంపిణీ అక్రమాలపై సీబీఐ విచారణ వరకూ వెళ్లిన వైసీపీ సర్కారు... ఈ వ్యవహారంలోనూ చంద్రబాబు పాత్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications