ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు- థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ : మాస్కు తప్పనిసరి..!!
థర్డ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ముందుగానే చర్యలు తీసుకోవాలని..అవసరమైన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటంతో పాటుగా ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. సంక్రాంతి వేళ ఇతర రాష్ట్రాలు.. ప్రాంతాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున గ్రామాలకు తరలి వస్తున్నారు. దీంతో.. జన సమూహాలు పెరగకుంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

థియేటర్లలో 50 శాతం ఆక్యెపెన్సీ
కేసుల తీవ్రత పెరగుకుండా ఆంక్షలు అమలు చేస్తూనే.. ఆస్పత్రుల్లోనూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. అందులో భాగంగా ఏపీలో అన్ని జిల్లాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సినిమా థియేటర్ల లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, జనాలు ఒక చోటకు వచ్చే అన్ని సముదాయాల్లోనూ కరోనా నిబంధనలు అమలు చేయాలని స్పస్టం చేసారు. దుకాణాలు..వ్యాపార సముదాయాల్లో ఖచ్చితంగా కరోనా ప్రోటోకాల్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసారు.

నిబంధనలు పాటించాల్సిందే
దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం, మాస్క్ తప్పని సరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మాస్కు లేకుంటే జరిమానా విధించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ మండల స్థాయిలోనూ కోవిడ్ కేర్ కేంద్రం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా వేరియంట్ మారుతుండటంతో దానికి అనుగుణంగా మందులు సైతం సిద్దం చేయాలని.. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి వారి లక్షణాలకు అనుగుణంగా మందులు అందించాలని సూచించారు.
Recommended Video

మాస్కు తప్పనిసరి
ఇక, గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 104 సేవలు అందించారో.. ఇప్పుడు అదే స్థాయిలో పని చేయాలని సూచించారు. కరోనా సమాచారం...ఆస్పత్రుల వివరాలు పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా ఆస్పత్రులను సైతం సిద్దం చేయాలన్నారు. ఏపీలో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించటంతో.. ఆక్సిజన్ సమస్య ఉండదని సీఎం చెప్పుకొచ్చారు. సామాజిక దూరం ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications