వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఆర్సీపై జగన్ సర్కార్ లీకులు-వారంలో ఉద్యోగులకు పిలుపు-భయపడబోమని హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగ సంఘాలకు గతంలో ఇచ్చిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి హామీలను నెరవేర్చకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలమైన ఉద్యోగ సంఘంతో దీనిపై ఇవాళ ప్రకటన ఇప్పించింది.

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఇవాళ పీఆర్సీ, ఇతర ఉద్యోగుల డిమాండ్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వెల్లడించారు. వారంలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పీలుపు వచ్చే అవకాశం ఉందన్నారు. పీఆర్సీ కి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు కోరే అవకాశం కూడా ఉందన్నారు. 40 శాతం వరకు ఫిట్మెంట్ కోరాలని భావిస్తున్ననట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 2020 నుంచి క్యాష్ రూపంలో అరియర్స్ ఇవ్వాలని కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

jagan government to call employees for talks on prc and other demands with in week

2022 జనవరి నుంచి జీతం తో పాటు అరియర్స్ చెల్లించాలని ఒత్తిడి తెస్తామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయాలు, మోడల్ స్కూళ్ళు, ఇతర కార్పొరేషన్ల కు చెందిన ఉద్యోగులకు అలాగే చెల్లించాలని కోరతామన్నారు. హెచ్ ఆర్ ఏ ను ఏమాత్రం తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం లాగే చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెడతామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని 92 సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

అలాగే సీపీఎస్ విషయంలో ను త్వరలోనే తేల్చాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో కలెక్టర్ లు ఆదేశాలు పాటించటం లేదన్నారు. డిసెంబర్ 21 తేదీన సీఎం జన్మ దినోత్సవం పురస్కరించుకుని గ్రామ వార్డు సచివాలయాల ఆవిర్భావ దినంగా నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 10 లోగా ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వస్తుందని,. అలా రాకపోతే ఆ తదుపరి మా కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.
ఎవరో బెదిరిస్తే భయపడే ప్రభుత్వం కాదిది అంటూ ఆయనే ప్రభుత్వం తరఫున మిగతా సంఘాలకు హెచ్చరికలు కూడా చేశారు.

English summary
andhrapradesh government to call employee associations for talks on prc and other demands with in a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X