రూ.27 వేల కోట్ల అప్పుకు కేంద్రం అనుమతి కోరిన జగన్- పార్లమెంట్ లో వైసీపీ, టీడీపీ పోరులో వెల్లడి
ఏపీ ప్రభుత్వం అప్పుల చిట్టా పెరిగిపోతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇవేవీ లెక్కచేయకుండా మరిన్ని అప్పుల కోసం జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా పార్లమెంట్ వేదికగా ఈ విషయం బయటపడింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఇది వెల్లడైంది.
ఏపీ ప్రభుత్వం రూ.27 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు కేంద్రం అనుమతి కోరినట్లు కేంద్ర ఆర్ధికశాఖ శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో రూ.27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి కోరందని ఆయన ఇవాళ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్లు అప్పు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారని కేంద్ర ఆర్ధిక శాఖ తరఫన ఆయన వివరాలు వెల్లడించారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నెలలకు రూ. 27,325.78 కోట్ల మేర బహిరంగ మార్కెట్లో అప్పులు తీసుకునేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. గత డిసెంబర్ లో జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు విజ్ఢప్తి చేసినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వున్న పరిమితిని రూ.42,472 కోట్లకు పెంచాలని జగన్ కోరినట్లు ఆర్ధిక శాఖ పేర్కొంది. దీంతో ఏపీ అప్పుల వ్యవహారం మరోసారి జాతీయస్ధాయిలో చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో జగన్ సర్కార్ అప్పులపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ.. జాతీయ స్ధాయిలో దీనిపై చర్చ జరగాలని కోరుకుంటోంది. ఇందుకు తగినట్లుగానే పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications