• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనాపై జగన్ సర్కార్ అలెర్ట్ .. 15రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్పీడ్ గా వ్యాక్సినేషన్

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అప్రమత్తమైంది . ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో, జనాలు ఎక్కువగా సంచరించే చోట, వర్తక వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, పరిశ్రమలు పాటించవలసిన కరోనా నిబంధనలను ప్రకటించిన ఏపీ సర్కార్ తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలకు శ్రీకారం చుట్టింది .

మాస్కులు లేకుండా తిరిగితే జరిమానాల వీర బాదుడు ... కరోనా కంట్రోల్ కి ఏపీలో పోలీస్ మార్క్ కొరడా

 కరోనా నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఏపీ సర్కార్ ఉత్తర్వులు

కరోనా నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఏపీ సర్కార్ ఉత్తర్వులు

ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలలో కరోనా నిబంధనలను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లలో,షాపింగ్ మాల్స్ లో, పరిశ్రమలలో భౌతికదూరాన్ని పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలి అని, ధర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న కారణంగా కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉన్నంతవరకు వివిధ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరోమారు అవలంబిస్తే బాగుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు పరిశ్రమలలో,రవాణా వాహనాలలో,యంత్రాల వినియోగంలోనూ శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టవలసిందిగా స్పష్టం చేసింది.

 వ్యాక్సినేషన్ వేగవంతంపై సమీక్ష .. పలు కీలక నిర్ణయాలు

వ్యాక్సినేషన్ వేగవంతంపై సమీక్ష .. పలు కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది .ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని జిల్లాల ప్రజలకు అవగాహన కల్పించాలని , వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.

 పదిహేను రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర సర్కార్

పదిహేను రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర సర్కార్

ఈ సమీక్షలో కరోనాను కట్టడి చేయడానికి పదిహేను రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు ఆదేశించారు. ఇదే సమయంలో ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు రోజువారీ ప్రచార కార్యక్రమాలను రూపొందించి కరోనా పై అవగాహన కలిగించడానికి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రజాప్రతినిధులను , అధికారులను ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములను చేయాలని, వర్తక వాణిజ్య సంఘాల వారిని, మహిళా సంఘాలను కూడా అవగాహన కల్పించడంలో భాగస్వామ్యం తీసుకునేలా చూడాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

కరోనా కలకలంపై స్పందించిన మంత్రి ఆళ్ళ నాని

కరోనా కలకలంపై స్పందించిన మంత్రి ఆళ్ళ నాని

1930 ప్రభుత్వాసుపత్రులు ,634 ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని సూచించిన మంత్రి నాని రాజమండ్రిలో కరోనా కలకలం పై స్పందించారు. ఇంటర్ చదువుతున్న 163మంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని వెల్లడి

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని వెల్లడి

అంతేకాదు వారితో పాటు కళాశాలలో చదివిన మిగిలిన విద్యార్థులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని , కళాశాల మొత్తం శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రబలుతున్న కరోనా మహమ్మారి నియంత్రించడానికి అన్ని చర్యలు చేపట్టామని, అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు . అప్రమత్తంగా ఉండటం అవసరం అన్నారు.

English summary
Health Minister Alla Nani held a review meeting on the acceleration of corona vaccination. Minister Alla Nani suggested that in view of the increasing number of corona cases, the people of all districts should be made aware .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X