Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో జగన్ సర్కార్ మరో బాదుడు; మీ సేవా కేంద్రాలలోనూ ఛార్జీల బాదుడు షురూ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్ చార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు ఇలా ఒకటేమిటి సామాన్యులపై విపరీతమైన భారం పెరిగింది. ఏపీలో పెరిగిన ఛార్జీల బాదుడుతో ఇప్పటికే జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం.

మీ సేవ ఛార్జీలు పెంపు.. ఏడాదికి ప్రజలపై 60 కోట్ల రూపాయల భారం

మీ సేవ ఛార్జీలు పెంపు.. ఏడాదికి ప్రజలపై 60 కోట్ల రూపాయల భారం

మీ సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ చార్జీల పెంపుతో అల్లాడుతున్న ప్రజలపై ఏపీ ప్రభుత్వం అదనపు భారం మోపుతోంది. ఇక ప్రభుత్వ నిర్ణయం మేరకు పెంచిన మీ సేవ సర్వీస్ ఛార్జీలు అమల్లోకి కూడా వచ్చాయి. కేటగిరి ఏ, కేటగిరీ బీ కింద అందించిన సేవలకు వసూలు చేసే ఛార్జీలను ఐదు రూపాయల మేర పెంచిన ఏపీ ప్రభుత్వం దీని ద్వారా ఆదాయాన్ని సంపాదించే ప్లాన్ వేసింది. దీని ద్వారా సంవత్సరానికి 60 కోట్ల రూపాయల భారం సామాన్య ప్రజలపై పడనున్నట్టు తెలుస్తుంది.

 పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుండి అమలు

పెంచిన సర్వీస్ ఛార్జీలు సోమవారం నుండి అమలు


మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు ప్రజలకు అందుతున్నాయి. దీనికి సర్వీస్ ఛార్జీల కింద ఏ కేటగిరీ కింద ఉన్న సర్వీసులకు 35 రూపాయలు, బి కేటగిరీ కింద ఉన్న సర్వీసులకు 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోను మిగిలిన మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. ఇక తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నిర్వాహకులకు సంబంధిత శాఖ సమాచారాన్ని పంపించింది. దీంతో సోమవారం నుండి మీ సేవా కేంద్రాలలో సర్వీస్ ఛార్జీలు పెరిగాయి.

ధరల పెరుగుదల, ఛార్జీల పెంపుతో ప్రజలపై అదనపు భారం, ప్రజల ఆందోళన

ధరల పెరుగుదల, ఛార్జీల పెంపుతో ప్రజలపై అదనపు భారం, ప్రజల ఆందోళన

ఇప్పటికే ఏపీలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు, వివిధ రకాల పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు తో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో మీసేవ సర్వీసులు ఛార్జీలను కూడా పెంచడం ప్రజలపై సర్కార్ అదనపు భారం వేయడమేనని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరల భారం భరించలేక సామాన్యులు విభిన్న రూపాలలో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నా సరే ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

జగన్ ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

జగన్ ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

ఇక సోషల్ మీడియా వేదికగా జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ ప్రతిపక్ష పార్టీలు జగన్ పాలనా వైఫల్యాలను టార్గెట్ చేస్తున్నాయి. సామాన్య ప్రజలపై భారం మోపుతున్న జగన్ సర్కారు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నాయి. బాదుడే బాదుడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. సామాన్యులపై ధరల, ఛార్జీల భారాన్ని తగ్గించవలసిన ప్రభుత్వాలే అదనపు భారాన్ని మోపడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని విమర్శలు వెల్లువగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+