Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరెంట్ బిల్లుల బాదుడుతో జగన్ సర్కార్ కొత్త షాక్ : అప్పుడు వందల్లో.. ఇప్పుడు వేలల్లో; టీడీపీ ఫైర్

విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్ ఇస్తుందన్న దేవినేని ఉమా
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసిపి సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్ ఇస్తోందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. నిరంతర ప్రక్రియగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు అని విద్యుత్ వినియోగదారులకు జగన్ సర్కార్ కొత్త షాక్ ఇస్తోంది అని దేవినేని ఉమ మండిపడ్డారు. ఆరు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 11,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని దేవినేని ఉమా పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు పెంపు చేయమని అప్పట్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను విస్మరించారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.

ఇళ్ళలో దీపాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి
టిడిపి నేత కళా వెంకట్రావు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై, జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. విద్యుత్ బిల్లు చూసి ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్న కళా వెంకట్రావు ఇళ్లల్లో గుడ్డి దీపాలు వాడుతున్నారని పేర్కొన్నారు. కరెంటు వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ప్రజలు లబోదిబోమంటున్నారు అని పేర్కొన్న ఆయన గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల కరెంట్ బిల్లులు వస్తున్నాయని, సామాన్య ప్రజలు వీటిని ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్ళలో 1,1611 కోట్ల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారని కళావెంకట్రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపరీతంగా పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jagan govts new shock with the current bills: TDP leaders Devineni Uma, Kala Venkatrao Fire

కమీషన్ల కోసమే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు .. ఆ భారం ప్రజలపై
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలపై ధ్వజమెత్తారు. కేవలం కమీషన్ల కోసమే విద్యుత్ ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆరోసారి విద్యుత్ ఛార్జీలు 2542 కోట్ల రూపాయల మేర పెంచి, ఇప్పటివరకు మొత్తంగా ప్రజల పై 11 వేల 500 కోట్ల భారాన్ని మోపారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అసలే కరోనా కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయని, అయినప్పటికీ జగన్ సర్కారు తీరుతో, విపరీతంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ప్రజలు సైతం విపరీతంగా వస్తున్న కరెంటు బిల్లులపై లబోదిబోమంటున్నారు. ఈ భారాన్ని భరించలేమని వాపోతున్నారు. ప్రభుత్వం బిల్లులను తగ్గించాలని ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+