జగన్‌కు హక్కు లేదు, ప్రజల కోసమే పెంచాం: రావెల

ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి రావెల కిషోర్ శుక్రవారం ధ్వజమెత్తారు. విద్యుత్‌ చార్జీలపై విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. జగన్‌ విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేసారు.

జగన్‌ దీక్షకు ప్రజలు రావడం మానేశారని, భవిష్యత్‌లో అతడిని అందరూ మర్చిపోతారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసమే విద్యుత్‌ చార్జీలను పెంచామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన మంత్రి పలు హాస్టళ్లను పరిశీలించారు.

తిరుపతిలో వేడెక్కిన ఉప ఎన్నికల ప్రచారం

Jagan has no right to talk about power hike: Ravela

చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టడీ దూసుకెళ్తోంది. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ అవుతాయని చెబుతున్నారు.

గంటా నివాసం ఎదుట హాకర్స్ ఆందోళన

గ్రేటర్ విశాఖలోని ఫుట్‌పాత్‌ల పైన వ్యాపారం చేస్తున్న హాకర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎఐటియూసీ ఆధ్వర్యంలో వందలాది మంది చిరు వ్యాపారులు మంత్రి గంటా నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ వెంటనే వ్యాపారులతో చర్చలు జరిపి హాకర్స్ జోన్‌లు ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+