• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

14న సొంతింటికి జ‌గ‌న్ : గృహ‌ప్ర‌వేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మ‌ద్ద‌తు లేఖ‌తో...!

|

వైసిపి- టిఆర్‌య‌స్ రాజ‌కీయాలు ఇక అమ‌రావ‌తి కేంద్రంగా కొన‌సాగ‌నున్నాయి. ఏపి రాజ‌ధాని కేంద్రంగా జ‌గ‌న్ కొత్త‌గా వైసిపి కార్యాల‌యం..ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి గృహ ప్రవేశ ముహూర్తం ఖ‌రారైంది. ఆ ముహూర్తం నుండే ఏపి లో మిష‌న్ -2019 ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిదుల‌కు ఆహ్వానించేలా జ‌గ‌న్ యోచిస్తున్నారు. అదే ముహూర్తాన మ‌రికొన్ని కీల‌క ప్ర‌క‌ట‌న‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు..

ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాల‌న్నారు : అందుకే జ‌గ‌న్ తో భేటీ..!

జ‌గ‌న్ పిలిచారా..కేసీఆర్ వ‌స్తాన‌న్నారా..

జ‌గ‌న్ పిలిచారా..కేసీఆర్ వ‌స్తాన‌న్నారా..

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో వైసిపి కి ఆహ్వానం ప‌లికేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..జ‌గ‌న్ కు ఫోన్ చేసారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌ల కోసం కేటీఆర్ నాయ‌కత్వంలో ఒక బృందం పంపిస్తున్న‌ట్లు చెప్పారు. అందుకు స‌రే అని చెప్పిన జ‌గ‌న్ లంచ్ కు రావాల‌ని ఆహ్వానించారు. అదే స‌మ‌యంలో తాను అమ‌రావ‌తి కేంద్రంగా సొంతింటి నిర్మాణం..అక్కేడ పార్టీ కార్యాల‌యం ఏర్ప‌టు చేస్తున్న విష‌యాన్ని జ‌గ‌న్‌..కేసీఆర్ కు వివ‌రించారు. ఫిబ్ర‌వ‌రి 14న ఆ ఇంటికి గృహ‌ప్ర‌వేశం కు ముహూర్తం ఖ‌రారైంద‌ని..ఆ కార్య‌క్ర‌మానికి రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించారు. అందుకు కేసీఆర్ త‌ప్ప‌క వ‌స్తాన‌ని చెప్పారు. అయితే, కేటీఆర్ - జ‌గ‌న్ స‌మావేశం త‌రువాత త్వ‌రలోనే కేసీఆర్ విజ‌య‌వాడ వెళ్లి జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. అయితే..జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు కేసీఆర్ వ‌స్తున్నారా.. లేక‌, కేసీఆర్ వ‌స్తాన‌ని చెప్ప‌టం తోనే జ‌గ‌న్ త‌న గృహ‌ప్ర‌వేశం నాడు రావాల్సిందిగా..ఆ రోజు శుభ‌కార్యంతో పాటుగా రాజ‌కీయాల పైనా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌వ‌చ్చే ఉద్దేశంతో ఈ ముహూర్తం ఎంచుకున్నారా అనే చ‌ర్చ సాగుతోంది.

హోదాకు మ‌ద్ద‌తు లేఖ‌తో..

హోదాకు మ‌ద్ద‌తు లేఖ‌తో..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో అడ్డుప‌డుతున్నార‌ని ఏపి ముఖ్య‌మంత్రి చం ద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఇదే విష‌యం పై కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఇదే విష‌యం పై స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాము ఏపికి హోదా విష‌యంలో వ్య‌తిరేకులం కాద‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు కేటీఆర్‌- జ‌గ‌న్ స‌మావేశంలోనూ ఇదే అంశం పై క్లారిటీ ఇచ్చారు. టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాము హోదా విష‌యంలో క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పుకొచ్చారు. అయితే, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. టిడిపి నేత‌లు మరోసారి ఇదే విష‌యాన్ని ప‌దేప‌దే ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో...వారికి కౌంట‌ర్ ఇచ్చేందుకు కేసీఆర్ విజ‌య‌వాడ కేంద్రంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ప్ర‌ధానికి ఏపికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ లేఖ రాయాల‌ని డిసైడ్ అయ్యారు. జ‌గ‌న్ ఇంటికి కేసీఆర్ వ‌చ్చిన స‌మ‌యంలో ఆ లేఖ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు విశ్వ‌సనీయ స‌మాచారం.

జ‌గ‌న్ ఫ్రంట్ లో చేరుతారా...కేసీఆర్ ఏం చేయ‌బోతున్నారు..

జ‌గ‌న్ ఫ్రంట్ లో చేరుతారా...కేసీఆర్ ఏం చేయ‌బోతున్నారు..

ఏపి రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న వైసిపి ని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో కి కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. దీనిని రాజ‌కీయ ప్ర‌చారాస్త్రంగా టిడిపి మ‌ల‌చుకుంటోంది. ఏపి వ్య‌తిరేకి కేసీఆర్ తో జ‌గ‌న్ ఎలా క‌లుస్తార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇదే స‌మ‌యం లో తెలంగాణ ఎన్నిక‌ల ముందు టిడిపి అధినేత నేరుగా కేటీఆర్ తో టిడిపి- టిఆర్‌య‌స్ పొత్తు పై ప్ర‌స్తావించిన విష‌యాన్ని వైసిపి నేత‌లు గుర్తు చేస్తున్నారు. అయితే, తొలి నుండి ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎవ‌రైతే మ‌ద్ద‌తు ఇస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. దీంతో, కేసీఆర్ ఏపికి హోదా కోసం లేఖ ఇస్తున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరుతారా..లేక ప‌రోక్ష మ‌ద్ద‌తు ఇస్తారా అనేది చూడాలి. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో వైసిపి చేర‌టం వ‌ర‌కే కేసీఆర్ పాత్ర ఉంటుందా..లేక ఏపి ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా జోక్యం చేసుకుంటారా అనేది వేచి చూడాలి..

English summary
Ys Jagan invited Telangana C.M Kcr for his new house warming ceremony on Feb 14th in vijayawada. on that occassion KCR and Jagan discuss on Federal Fornt matters. KCR may write letter to P.M on supporting special stauts for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X