జగనే చెప్పారు కదా... మరీ ఆయన తప్పుకోవాల్సిందేగా: మంత్రి సోమిరెడ్డి
జగన్ దొంగ కంపెనీలు పెట్టి వందల కోట్లు బదిలీ చేశారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాప్-10 జాబితాలో జగన్ పేరుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ వేల కో
నెల్లూరు: అవినీతిపరులు రాజకీయాల్లో ఉండొద్దని జగనే అంటున్నారని, మరి ఈ లెక్కన ఆయన ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలి కదా? అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జగన్ దొంగ కంపెనీలు పెట్టి వందల కోట్లు బదిలీ చేశారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాప్-10 జాబితాలో జగన్ పేరుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్నారు.

ఏపీకి జగన్ కళంకం: వర్ల ఫైర్
ఏపీకి జగన్ కళంకంగా మారారని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠను జగన్ దిగజార్చుతున్నారన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరెప్షన్‌లో జగన్ నెం.1 అని, ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు వచ్చిందన్నారు.
దీనిపై పాదయాత్రలో జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోగా కేసుల నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవాలన్నదే జగన్ వ్యూహమని వర్ల రామయ్య పేర్కొన్నారు. కానీ ఆయన అనుకున్నది జరగదని, జగన్ తన శేష జీవితం జైలులో గడపడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications