అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించిన వైసీపీ ఎంపీ
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అనేక మలుపులు తిరిగింది. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలోనే ల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. హైకోర్టులో నిరంజన్ రెడ్డి లెవనెత్తిన పాయింట్లకు ప్రభుత్వ తరుఫున న్యాయవాది దగ్గర సమాధానం లేకండా పోయింది. ఈ కేసులో 11 నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు.ఈ సందర్బంగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కేసును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు.

షారుక్ ఖాన్ నటించిన రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుక్ ఖాన్‌కు ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపింది. షారుక్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. పుష్ప-2 విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి , అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది.4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications