అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన జగన్ లాయర్
తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications