వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు సూత్రధారి చంద్రబాబే: రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను డబ్బుతో లోబర్చుకొనేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని నోటుకు ఓటు కేసులో ఏ-1 నిందితుడిగా చేర్చాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి మరొక న్యాయం ఉండరాదని అన్నారు.

చంద్రబాబు ఉండాల్సింది జైల్లోనేనని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేలతో బేరసారాలకు కుట్ర చేసింది చంద్రబాబు అని, నోట్ల కట్టలతో ఆయన పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా పట్టుబడ్డారని తెలిపారు. చంద్రబాబు ఫోన్ సంభాషణల్లో కుట్ర బట్టబయలైందని చెప్పారు. ఏడాది పాలనలో లంచాల ద్వారా వచ్చిన అవినీతి డబ్బును తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు వెచ్చించారని ఆరోపించారు. ఏడాది కాలంలో రాష్ర్టాన్ని స్కామాంధ్రప్రదేశ్‌గా తయారుచేశారని విమర్శించారు.

ఖచ్చితమైన సాక్ష్యాలున్నప్పుడు చంద్రబాబును ఈ కేసులో ఇంకా ఏ-1గా ఎందుకు చేర్చటంలేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, కుట్ర బట్టబయలు కావడంతో రెండురోజులుగా ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ.. రెండు రాష్ర్టాల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను డబ్బుతో లోబర్చుకొనేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని నోటుకు ఓటు కేసులో ఏ-1 నిందితుడిగా చేర్చాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు.

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి మరొక న్యాయం ఉండరాదని అన్నారు. చంద్రబాబు ఉండాల్సింది జైల్లోనేనని పేర్కొన్నారు.

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు

ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ జగన్ బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించటం ఆయన నిస్సిగ్గుతనానికి నిదర్శనమన్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ జగన్ బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలవనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎ-1గా చేర్చాలంటూ కేంద్ర హోం మంత్రికి జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు.

English summary
YSR Congress Party (YSRCP) president YS Jaganmohan Reddy on Tuesday called on President Pranab Mukherjee in New Delhi and demanded action against Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu in the cash-for-vote scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X