జగన్,ఎమ్మెల్యే ఆర్కే.వైసిపి మాఫియాను దింపారు:బుద్ధా సంచలనం,ఇలా ఎందుకు చేస్తున్నారు?:కాంగ్రెస్
అమరావతి:వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహాలు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
సోమవారం మధ్యాహ్నం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కేపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతోందని వీరిద్దరూ ఒక జాతీయ ఛానల్‌తో కుమ్మక్కై, తద్వారా తప్పుడు సర్వేలు నిర్వహించి వైసీపీకి ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆర్కే శాసన సభ సమావేశాలు సజావుగా జరుగుతుంటే భరించలేకపోతున్నారని దుయ్యబట్టారు.

అందుకే జగన్ తో సంప్రదించి ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ముట్టడి అనే కుట్రకు తెర లేపారని బుద్ధా వెంకన్న వెల్లడించారు. ఈ కుట్ర ప్రకారం రాష్ట్రంలో ఉన్న వైసీపీ మాఫియా గ్యాంగ్ లను మారువేషాలతో విజయవాడ హోటళ్లలో దింపి నాటకాలు ఆడుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ మాఫియా ముఠాలు ప్రస్తుతం విజయవాడ హోటల్స్ లో ఉన్నాయన్నారు. తునిలో రైళ్లు తగులబెట్టారు...ఇక్కడ ఏమి చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ వాళ్ళు అసెంబ్లీ ,పార్లమెంట్ లకు వెళ్ళరని ఎద్దేవా చేశారు. అందువల్లే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామన్నారు.జగన్ ,బొత్స ,భూమన అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.జగన్ అతని బ్యాచ్ దొనకొండ లో వేల ఎకరాలు భూములు కొన్నారని...రాజధాని దొనకొండ లో వస్తుందని జగన్ రైతుల్ని నమ్మించారని విమర్శించారు.
అమరావతి పేరుతో ఏపీ ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత రామచంద్రయ్య మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని...ప్రతి పథకంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. అప్పులు తేకుండా రాజధాని నిర్మిస్తానని చెప్పిన టిడిపి ప్రభుత్వం ఇప్పుడు బాండ్ల రూపంలో ఎందుకు అప్పులు తెస్తున్నారో తెలియడం లేదన్నారు.
మీ హయాంలో తెచ్చిన అప్పులు...పథకాల అమలు కోసం చేసిన ఖర్చులపై టిడిపి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఆర్టీఐ కమిషన్‌ను టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications