వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మౌనం వీడాలి..! వర్గీకరణకు చొరవ చూపాలన్న మందకృష్ణ..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వైఖరి చెప్పాలని ఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఆయన మాట్లాడుతూ...తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్గీకరణకు అప్పుడు అనుకూలంగా ఉన్నారు .ఆయన అడుగుజాడల్లో నడిచే జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. ఎంపీ గా ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన నిర్ణయాన్ని చెప్పాలని కోరారు.

వర్గీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి రాష్ట్ర శాఖలు ఇష్టమైన వైఖరిని ప్రకటించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పాయని, తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అనుకూలంగా కేంద్రానికి నివేదిక పంపింది .ఆంధ్ర ప్రదేశ్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణలో ఈనెల 27,28 తేదీల్లో మేడారం జాతర జరగనున్నట్లు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Recommended Video

రైతుల పై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
Jagan must break silence.!Mandakrishna demands to initiate the classification..!!

ఇటు బీజేపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా మందకృష్ణ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కట్టుబడి ఉన్న బీజేపీ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బిల్లు ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వ మంత్రివర్గంలో ఎస్సీ లకు స్థానం కల్పించకుండా అవమానించారని ఆయన మండిపడ్డారు. ఏపీ లో 7 శాతం ఉన్న మాదిగలకు 2 మంత్రులు కేటాయిస్తే, తెలంగాణ లో 12 శాతం ఉన్న ఎస్సీ లకు ఒక్కటి కూడా కల్పించక పోవడం హేయమైన చర్య అని మందకృష్ణ మండిపడ్డారు.

English summary
SC Leaders Mandakrishna Madiga said that YS Jaganmohan Reddy should remain silent on the issue of SC classification. Speaking at Krishnajila Nandigama, he said that his father, ys Rajasekhar Reddy, was in favor of the classification then.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X