జ‌గ‌న్ కొత్త ఇంట్లోకి గృహ ప్ర‌వేశం : ఆ ఇంటి పై చ‌ంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు..!

వైసిపి అధినేత జ‌గ‌న్ అమ‌రావ‌తి స‌మీపంలోని తాడేప‌ల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేసారు. 8.19 గంట‌ల‌కు నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం జ‌గ‌న్ స‌తీ స‌మేతంగా ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య మంత్రి చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం చేస్తున్న స‌మ‌యంలోనే చంద్ర‌బాబు స్పందించా రు. జ‌గ‌న్ నూత‌న ఇంటిపై పార్టీ నేత‌ల‌తో చేసిన ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

Jagan new house in another Palace : Chandra babu on Jagan new residence

కొత్త ఇంట్లోకి జ‌గ‌న్‌...
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకు న్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు.

Jagan new house in another Palace : Chandra babu on Jagan new residence

అనంతరం వైఎస్‌ జగన్‌ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు.. పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీ లు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. రాష్ట్ర అధికార ప్రతినిధులు.. అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు.. పార్లమెంటు.. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు. రెండు ఎక‌రాల స్థ‌లం లో నూత‌న నివాసంతో పాటుగా పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేసారు.

Jagan new house in another Palace : Chandra babu on Jagan new residence

చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు..
జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం చేస్తున్న స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. హైదరాబాద్ వీడి జగన్మోహన్ రెడ్డి రాలేదంటూనే..పేలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడని ఎద్దేవా చేసారు. ఎక్కడకు పోయినా రాజ ప్రాసాదా ల్లోనే జగన్ బస చేస్తారంటూ విమ‌ర్శించారు. లోటస్ పాండ్ పేలెస్.. బెంగళూరులో పేలెస్..పులివెందుల ప్యాలెస్‌..

Jagan new house in another Palace : Chandra babu on Jagan new residence

అమరావతిలో ఇప్పుడు ఇంకో పాలెస్ అంటూ టార్గెట్ చేసారు. లెస్ లపైనే జగన్మోహన్ రెడ్డి ధ్యాస..బ‌స ఉంటాయం టూ వైఎస్సార్ కాంగ్రెస్ పేదల పార్టీ కాదు.. పేలెస్ ల పార్టీ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజాసేవ పట్ల జగన్ కు చిత్తశుద్ది లేదన్నారు సీయం. విశాఖ‌లో జ‌రిగే మోదీ స‌భ‌కు వైసిపి జ‌న స‌మీక‌ర‌ణ చేస్తుందంటూ ఆరోపించారు.

Jagan new house in another Palace : Chandra babu on Jagan new residence
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+