జ‌గ‌న్ ఓపెన్ ఎటాక్ : బాబు - రాధాకృష్ణ మొహంలో ఓట‌మి భ‌యం : నాడు వైయ‌స్ త‌ర‌హాలోనే..!

Recommended Video

    AP Assembly Elections 2019 : చంద్ర‌బాబు,రాధాకృష్ణ మొహాల్లో ఓట‌మి భ‌యం : జ‌గ‌న్

    ఏపి ఎన్నిక‌ల ప్ర‌చార వేళ‌..జ‌గ‌న్ త‌న సర‌ళి మార్చారు. ఇప్పటి వ‌ర‌కు చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఎన్నిక‌ల ప్ర చారం సాగించిన జ‌గ‌న్...ఇక‌, టిడిపి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న మీడియా ద్వారా న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంచ‌నా కు వ‌చ్చా రు. దీంతో..ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్లో మీడియా అంటూ మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్ ఇప్పుడు నేరుగా ప‌త్రిక‌ల పేర్లు..వాటి అధినేత పేర్లు మ‌రీ చెబుతూ కార్న‌ర్ చేస్తున్నారు..

    కోడెల పై తీవ్ర విమ‌ర్శ‌లు..

    కోడెల పై తీవ్ర విమ‌ర్శ‌లు..

    ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో జ‌రిగిన స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొన్నారు. అక్క‌డ కోడెల కుటుం బం పై ఆరోప‌ణ‌లు చేసారు. స‌త్తెన‌ప‌ల్లి కెఎస్‌టి పేరుతో కోడెల టాక్స్ వ‌సూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. సేఫ్ ఫార్మా పేరుతో నాసిర‌కం మందుల‌ను ఉత్ప‌త్తి చేసి విక్ర‌యిస్తున్నార‌ని ధ్వ‌జ మెత్తారు. వివాదాస్ప‌ద భూముల‌ను ఆక్ర‌మించ టం..దౌర్జ‌న్యాలు చేయ‌టం కోడెల కుటుంబానికి అల‌వాటుగా మారింద‌న్నారు. స్పీక‌ర్ గా ఉంటూ ఆ ప‌ద‌వ‌ని భ్ర‌ష్టు ప ట్టించార‌ని కోడెల పై విరుచుకుప‌డ్డారు. కోడెల కుటుంబ స‌భ్యులు చేస్తున్న దౌర్జాన్యాల పై పెద్ద ఎత్తున స్థానికుల నుం డి ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంద‌న్నారు. కోడెల చేసిన అక్ర‌మాల‌కు ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. అంబ‌టి రాంబాబు సైతం త‌న‌కు ఈ సారి అసెంబ్లీకి వెళ్లే అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్య‌ర్దించారు.

    రాధాకృష్ణ మొహంలో భ‌యం క‌నిపిస్తోంది..

    రాధాకృష్ణ మొహంలో భ‌యం క‌నిపిస్తోంది..

    చంద్ర‌బాబు..ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ మొహంలో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు జ‌గ‌న్‌. రెండు రోజుల క్రి తం లోక్‌నీతి స‌ర్వే అంటూ దొంగ స‌ర్వేను వండి వార్చార‌ని..ఆ త‌రువాత లోక్‌నీతి సంస్థ అది తాము చేసిన స‌ర్వే కాద ని ప్ర‌క‌టించంద‌ని గుర్తు చేసారు. విశాఖ‌లో ఓ గ‌ర్భిణీ స్త్రీని వైసిపి కార్య‌క‌ర్త‌లు హింసించార‌ని రాసుకొచ్చార‌ని..అయితే ఆ అంశంలో వైసిపి కి ఎలాంటి సంబంధం లేద‌ని పోలీసులే తేల్చార‌ని వివ‌రించారు. ప్ర‌తీ రోజు ఈనాడు నాలుగు పేజీ లు టిడిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్న‌ట్లుగా ఆ రెండు ప‌త్రికాధిప‌తుల కు చంద్ర‌బాబు ముద్దు వ‌స్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు హామీలిచ్చి మోసం చేసినందుకుకా ఈ ప‌త్రికాధిపతు ల‌కు బాబు పై ప్రేమా అంటూ ప్ర‌శ్నించారు. జ‌ర్న‌లిజం అంటే మీ ప్ర‌యోజ‌నాలా లేక మీ ద్వారా బాబు ప్ర‌యోజ‌నాలు కాపాడ‌ట‌మా అని నిల‌దీసారు.

    ప‌సుపు- కుంకుమ డ్రామాలకు మోస‌పోవ‌ద్దు..

    ప‌సుపు- కుంకుమ డ్రామాలకు మోస‌పోవ‌ద్దు..

    ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల వేళ డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ప‌సుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నార‌ని..ఆ డ్రామా ల‌కు మోస పోవ‌ద్ద‌ని జ‌గ‌న్ కోరారు. తాము అధికారంలోకి వ‌చ్చి త‌రువాత ఎన్నిక‌ల నాటికి పెండింగ్ లో ఉన్న డ్వాక్రా రుణాల‌న్నింటినీ మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా తాను ప్ర‌క‌టించిన అన్ని అంశాల‌ను అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌రో వారం రోజుల్లో చంద్ర‌బాబు పాల‌న వీడి..కొత్త పాల‌న దిశ‌గా అడుగులు ప‌డుతా య‌ని చెప్పుకొచ్చారు. అయిదేళ్ల పాటు చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇచ్చార‌ని..ఆయ‌న మోసం చేసార‌ని..ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్దించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+