చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు.. నిరుద్యోగ భృతి ఏది?: జగన్ బహిరంగ లేఖ
అధికారం చేపట్టి 33నెలలు గడిచిపోయినా చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోయారని వైఎస్ జగన్ లేఖ ద్వారా గుర్తుచేశారు.
హైదరాబాద్: గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి మీడియాకు లేఖ విడుదల చేశారు.
అధికారం చేపట్టి 33నెలలు గడిచిపోయినా చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోయారని వైఎస్ జగన్ లేఖ ద్వారా గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ 33నెలల కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.2వేల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న కోటి 75లక్షల కుటుంబాలకు లక్షా 15వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని జగన్ వివరించారు.

మార్చి 13న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని సీఎం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే 2017-18 సంవత్సరానికి నిరుద్యోగులకు బకాయిలతో పాటు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం హామిలను నిలబెట్టుకోకపోతే తమ కార్యాచరణను ప్రకటిస్తామని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications