కాస్త ఓపిక పట్టాలని జగన్, గడ్కరీని కలిశారన్న బిజెపి

గడ్కరీని జగన్ కలిశారు
భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను ఇతర పార్టీల నేతలు కలిసినంత మాత్రాన పొత్తు కుదిరినట్లు అనుకోవద్దని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి వేణుగోపాల రెడ్డి మంగళవారం హైదరాబాదులో చెప్పారు. జగన్ కూడా ఇటీవల మహారాష్ట్రకు వెళ్లినప్పుడు తమ పార్టీ అగ్రనేత నితిన్ గడ్కరీని కలిసి వచ్చారన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సహా చాలా పార్టీల నేతలు బిజెపితో పొత్తు కోసం తహతహలాడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణలు మారుతాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటే బిజెపి లక్ష్యమన్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తామన్నారు.
టిడిపితో పొత్తు ఉంటుందని ఏ జాతీయ నేత చెప్పలేదని, బిజెపి అగ్రనేతల్ని చంద్రబాబు కలిసినట్లే గడ్కరీని జగన్ కలిశారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా బిజెపితో కలిసే ఆలోచన చేస్తున్నారన్నారు. కలిసినంత మాత్రాన పొత్తు ఉన్నట్లు కాదన్నారు.












Click it and Unblock the Notifications