కోర్టుకు జగన్, సాయి: దేశవ్యాప్త టూర్‌పై 12న విచారణ

రఘురాం, భారతి సిమెంట్స్ ఛార్జీషీటు పైన కోర్టులో విచారణ జరిగింది. దీనికోసం వారు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈ ఛార్జీషీటు పైన విచారణను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
బెయిల్ సడలింపు పిటిషన్ విచారణ 12వ తేదికి
మరోవైపు తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ వేసిన పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
కాగా తనకు దేశవ్యాప్త పర్యటనలకు షరతులను సడలించాలని వైయస్ జగన్ బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించాల్సి బాధ్యత ఉందని తెలిపారు. తనపై నేరం ఇంకా రుజువు కానందున నియోజకవర్గానికి, పార్టీకి సేవలు అందించే హక్కులను కాలరాయరాదని కోరారు. ఇందుకు సంబంధంచి జగన్ రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications