• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చేస్తున్న యాగం అదే... చేయిస్తున్న స్వామి అతనే... కేసీఆర్ మాదిరిగా జగన్ కు కలిసొస్తుందా ?

|
  Ap Assembly Election 2019 : రాజశ్యామల యాగం చేస్తున్న జగన్ || Oneindia Telugu

  ఎన్నిక‌ల వేళ యోగం ద‌క్కించుకోవ‌టం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం ద‌క్కించుకో వాల‌నే ల‌క్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జ‌గ‌న్ సైతం కేసీఆర్ బాట ప‌ట్టారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి గా రెండో సారి అధికారం ద‌క్కించుకోవ‌టానికి ముందు ఆయ‌న చేయించిన యాగాల‌నే జ‌గ‌న్ చేయిస్తున్నారు. ఇప్పుడు వైసిపి నేత‌ల్లో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.

  నెల్లూరు లో రాజ‌శ్యామ‌ల యాగం..

  నెల్లూరు లో రాజ‌శ్యామ‌ల యాగం..

  వైసిపి అధినేత జ‌గ‌న్ ఈ సారి అధికారంలోకి రావ‌టం కోసం ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. ప్ర‌తీ స‌భ‌లోనూ దేవు డి ఆశీస్సులు..ప్ర‌జ‌ల ఆశీస్సులు ఉంటే సీయం అవుతానంటూ చెప్పే జ‌గ‌న్‌..ప్ర‌స్తుతం ప్ర‌చారం రూపం లో ప్ర‌జ‌ల మ ధ్య‌నే ఉంటున్నారు. ఇక‌, ముఖ్య‌మంత్రి యోగం కోసం రాజ‌శ్యామ‌ల యాగం చేస్తున్నారు. ఇందు కోసం త‌న‌కు సన్నిహి తంగా ఉండే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ అధ్వ‌ర్యంలో ఈ యాగం కొన‌సాగుతోంది. విశాఖ శార‌దా పీఠాధిపతి స్వ‌రూపానంద స్వామి ఈ యాగం చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలోనూ జ‌గ‌న్ కోసం ఈ యాగాన్ని నిర్వ‌హించారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న జ‌న్మ‌..న‌క్ష‌త్ర బ‌లం ఆధారంగా ఈ యాగం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారం లో బిజీ గా ఉండ‌టంతో..ఆయ‌న పేరున రిత్వికులు ఈ యాగం కొన‌సాగిస్తున్నారు.

  ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

  కేసీఆర్ త‌ర‌హాలోనే..

  కేసీఆర్ త‌ర‌హాలోనే..

  తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం విశాఖ స్వ‌రూపానంద స్వామి రాజ శ్యామ‌ల యా గం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే కేసీఆర్ విశాఖ కు వ‌చ్చి శార‌దా పీఠం లో రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. తాను ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం స్వ‌రూపానంద ఈ యాగం చేసార‌ని..రాజ శ్యామ‌ల అమ్మ‌వారు ఆ ఆశ్ర‌మం లో మాత్ర‌మే ఉండ‌టంతో అక్క‌డ‌కు వెళ్లాన‌ని కేసీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం అదే త‌ర‌హాలో ఈ యాగం చేయిస్తున్నారు. ఈ యాగం లో మొత్తం 27 మంది రిత్వుకులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ త‌ర పున ధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌రు వాత జ‌గ‌న్ విశాఖ లోని శార‌దా పీఠానికి వెళ్లి అమ్మ‌వారి ప్ర‌సాదం స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది.

  ఎన్నిక‌లు ముగియ‌గానే విదేశాల‌కు..

  ఎన్నిక‌లు ముగియ‌గానే విదేశాల‌కు..

  పాద‌యాత్ర ద్వారా 14 నెల‌ల పాటు ప్ర‌జ‌ల్లోనే ఉన్న జ‌గ‌న్.. ఆ వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌చారానికి దిగారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌..సోద‌రి షర్మిళ‌..స‌తీమ‌ణి భార‌తి ..ఇలా అంద‌రూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగిపోయారు. ఏప్రిల్ 11న పులివెందుల లో జ‌గ‌న్ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట న‌కు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ఒక‌టి రెండు రోజుల్లో జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న టూర్ షెడ్యూల్ ఖ‌రారు కానుంది.ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి వారం రోజులు కుటుంబ స‌భ్యులు మొత్తం పార్టీ గెలుపు కోసం ప్ర‌తీ రోజు ఆరు స‌భ‌ల చొప్పున పాల్గొ నాల‌ని నిర్ణ‌యించారు.

  English summary
  Ycp cheif jagan doing Raja Shyamala Yagam for winning in elections and to come in power. Visakhsa Sarada peetham conducting this yagam on behalf of Jagan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X