వైసీపీని పద్ధతిగా ట్రాక్ ఎక్కించిన టీడీపీ

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అనాలోచితంగా తీసుకుంటోన్న నిర్ణయాలు, చర్యలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను పట్టాలెక్కించినట్టే కనిపిస్తోంది.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మొదలుకుని..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మొదలుకుని తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వరకూ టీడీపీ- జనసేన- బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ వచ్చిందనేది అందరి అభిప్రాయం. ఈ విషయాన్ని అటు కూటమి నాయకులు సైతం ఆఫ్ ది రికార్డ్‌గా అంగీకరిస్తోండటమే దీనికి నిదర్శనం.

Jagan Reddy hold key meeting along with senior YSRCP leaders today

తిరుపతి తొక్కిసలాట..

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఒకరు, జరగలేదంటూ ఒకరు పరస్పర విరుద్ధ ప్రకటనలు సైతం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అటు వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ విషయంలో టీటీడీ పాలక మండలి ఘోరంగా విఫలమైందనడాకి ప్రత్యక్ష ఉదాహరణ- అక్కడ చోటు చేసుకున్న తొక్కిసలాటే. ఈ దుర్ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలుకావడం టీటీడీ చరిత్రలో ఓ బ్లాక్ మార్క్.

బలం లేకపోయినా..

తాజాగా అదే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకుంది. సొంతంగా ఎలాంటి బలం లేకపోయినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ పాకులాడిందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లను అపహరించడానికీ వెనుకాడట్లేదంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

జనంలో అసంతృప్తి జ్వాల..

ఇప్పటికే ఒక్క పింఛన్లు మినహా మిగిలిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడం, వాటిని అప్పుడు ఇప్పుడూ వాయిదాలు వేస్తూ వస్తోండటం, దాదాపుగా అటకెక్కించిన వ్యవహారం పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందనేది బహిరంగ రహస్యం. స్వయంగా చంద్రబాబు అన్నమయ్య రాయచోటి జిల్లా సంబేపల్లి బహిరంగ సభలో దీన్ని చవి చూశారు కూడా.

21 మంది ఎంపీలు ఉన్నా ఏం లాభం?

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినప్పటికీ- అదే మహాద్భాగ్యం అంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలు సైతం వైసీపీకి అస్త్రంగా మారాయి. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నా, కూటమికి ఏకంగా 21 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం క్లియర్‌గా బోధపడింది రాష్ట్ర ప్రజలకు.

ట్రాక్ ఎక్కిన వైసీపీ..

ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీని ట్రాక్ ఎక్కించినట్టయింది. 11 సీట్లకే పరిమితం అయ్యేంత ఘోర ఓటమిని సైతం మరిపించేలా చేశాయి టీడీపీ అనుసరిస్తోన్న వ్యూహాలు.. నిర్ణయాలు.. చర్యలు. ఇఫ్పుడా పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివ్ మోడ్‌ ఆన్ చేసింది. సూపర్ 6 హామీల కోసం రోడ్డెక్కుతోంది.

ముఖ్య నాయకులతో సమావేశం

ఈ క్రమంలో వైఎస్ జగన్.. నేడు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన జిల్లాల పర్యటనలు, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని రాజకీయ యుద్ధం గురించి నాయకులకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+