జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్.. నీ ఖేల్ ఖతం; ఆ వీడియోతో వంగలపూడి అనిత టార్గెట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది .అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిని మించి ఒకరు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఎలాగైతే పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తారో అలాగే ఇప్పటి నుండే మాటల్లో కూడా వాడి వేడి కనిపిస్తుంది. ఇప్పటి నుండే ఎన్నికల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు.

జగన్ పాలనపై చండ్రనిప్పులు.. చంద్రబాబుపై వైసీపీ నేతల విమర్శలు
ఇప్పటికే ఏపీలోని అధికార వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం, వైయస్సార్సీపి బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంటే, బాదుడే బాదుడు అంటూ టీడీపీ ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వైసిపి సర్కారు తీరును, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంది.
ఇక చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జగన్ పాలనపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటూ, ఐదేళ్ళు పాలించే దమ్ము లేక ముందస్తు ఆలోచన చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు కర్నూలు జిల్లాలో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్నూలులో చంద్రబాబుకు బ్రహ్మరధం.. వంగలపూడి అనిత ఆసక్తికర పోస్ట్
ఇక కర్నూలు జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని వీడియో షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, చంద్రబాబు పర్యటనను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేని యువ నాయకుడని పిలవబడే వృద్ధుడు ఒక వైపు, అర్ధరాత్రి అవుతున్నా అశేష జన సందోహం ప్రేమాభిమానాల మధ్య అలసట లేని ముఖంతో ఠీవీగా మా నాయకుడు మరోవైపు అంటూ పేర్కొన్నారు వంగలపూడి అనిత.

జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్.. అనిత పోస్ట్; రాష్ట్రంలో ఎన్నికల వేడి
జగన్మోహన్ రెడ్డి పరదాలు, బారికేడ్లు లేకుంటే బయటకు రాలేక పోతున్నారు అంటూ, ఆయన యువకుడైన వృద్ధుడు అంటూ విమర్శలు గుప్పించారు. చచ్చేంత ప్రేమ ఉన్న ఈ జనం సాక్షిగా.. జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ ఖేల్ ఖతం అంటూ వంగలపూడి అనిత ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ మంత్రి రోజా ఇటీవల చంద్రబాబును ఉద్దేశించి, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తూ క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మించి ఒకరు చేస్తున్న వ్యాఖ్యలతో, యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పర్యటనలతో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications