ఏపీలో ఇసుక తవ్వకాలపై జగన్ సర్కార్ క్లారిటీ-సుప్రీం తీర్పు ప్రభావం ఎక్కడంటే..?

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల్ని నిషేధిస్తూ గతంలో ఎన్టీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిన్న సమర్ధించింది. దీంతో ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయనే ప్రచారం సాగుతోంది. దీనిపై గనులశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రభావం ఎంత వరకూ పరిమితం అన్న దానిపై గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశంతో పాటు ఏపీ ప్రభుత్వ విధానం కూడా స్పష్టంచేశారు.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి ఇవాళ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీపరీవాహక ప్రాంతాల్లో బి-2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరిలో 18 ఒపెన్ ఇసుక రీచ్ లకు ఇచ్చిన అనుమతులను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామన్నారు. ఈ రీచ్ లకు సంబంధించి తాజాగా మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను సదరు సంస్థ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాతే ఈ 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చన్నారు.

jagan

అలాగే పర్యావరణంకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ ఈ 18 రీచ్ లపై ఎన్జీటి విధించిన జరిమానాకు సుప్రీంకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరిల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణశాఖ పునఃసమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు సూచించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన ఇసుక పాలసీని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా పర్యావరణానికి ఎక్కడా విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

చిత్తూరు జిల్లాలోని 18 ఇసుక రీచ్ లకు సంబంధించి ఎన్జీటిలో దాఖలైన కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వాటిల్లో తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని గనులశాఖ ఆదేశించిందని తెలిపారు. రాష్ట్రంలో వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణరంగానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్నిచోట్ల ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వర్షాల వల్ల నదులు, జలాశయాల్లో ఇసుక తవ్వకాలకు విఘాతం ఏర్పడుతుందని, దీనివల్ల నిర్మాణపనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలోనే ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+