అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం రూ.982 కోట్లు వెనక్కి తీసుకోలేదా? 300 కోట్లపై సమాచారం !ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ !

|
Google Oneindia TeluguNews

ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంలో దాదాపు వెయ్యి కోట్లను తాజాగా వెనక్కి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఏపీకి ఇవ్వాల్సిన ఈ పరిహారంలో వెయ్యి కోట్లను పాత బకాయిల కింద కేంద్రం జమ చేసుకున్నట్లు ఈ వార్తల సారాంశం. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది. అయితే ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఈ వ్యవహారంపై వాస్తవాలతో కూడిన వివరణ ఇచ్చారు. ఇందులో ఆయన కేంద్రం నిధుల విడుదల, వెనక్కి తీసుకోవడంపై వచ్చిన వార్తలు అబద్ధాలే అన్నారు.

 ఆ 982 కోట్లపై బుగ్గన క్లారిటీ

ఆ 982 కోట్లపై బుగ్గన క్లారిటీ


కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా రూపాల్లో ఈ మధ్య ఏపీకి ఇచ్చిన రూ.982 కోట్లను వెనక్కి తీసుకుందంటూ
వచ్చిన వార్తలు అవాస్తవమని ఆర్ధికమంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందనే దానిపై ఆర్ధికమంత్రి తన వివరణలో వాస్తవాలు వెల్లడించారు. ఇవేవీ పట్టించుకోకుండా మీడియాలో వార్తలు రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తమ ప్రభుత్వానికి జరిగిన లావాదేవీల్ని వక్రీకరించి వార్తలు రాయడంపై బుగ్గన మండిపడ్డారు.

 అసలేం జరిగింది ?

అసలేం జరిగింది ?


నవంబర్ 25న జీఎస్టీ బకాయిల కింద ఏపీకి కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.682 కోట్లు కాగా... ఆ మొత్తాన్ని కేంద్రం ఏమీ వెనక్కి తీసుకోలేదని ఆర్దికమంత్రి తెలిపారు. పాత బకాయిల కింద సర్దుబాటని ఆరోపించడంలో అసలు అర్థమే లేదన్నారు. నవంబర్ 30న ఏపీకి రావాల్సిన కేంద్ర నిధులు రూ.300కోట్లు ఇప్పటికే వచ్చాయన్నారు. వర్తమానాలు, రాయబారాలు, దాపరికాలు ఇందులో ఏవీ లేవన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నట్లు వర్తమానం అందినా ఇంకా అవి చేరలేదని వార్తలు రాయడంపై బుగ్గన ఫైర్ అయ్యారు. ఇవి అర్థం పర్థం లేని కథనాలు కావా అన్నారు. ఈ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదన్నారు.

జీతాలు, పింఛన్ల చెల్లింపుపై బుగ్గన

జీతాలు, పింఛన్ల చెల్లింపుపై బుగ్గన

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జీతాలు, పింఛన్లను వారం రోజుల్లోనే అన్నీ క్లియర్ చేస్తోందని బుగ్గన తెలిపారు. సాంకేతిక, అనివార్య కారణాలతో వీలుకాని అరుదైన సందర్భాల్లోనూ 10 రోజుల్లోగా ఎక్కడికక్కడ చెల్లింపులన్నీ పూర్తవుతున్నాయన్నారు. ఈ ఆర్థిక నిర్వహణ చాలదా మా ప్రభుత్వ దార్శనికత, చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవడానికి అన్నారు. రోజుకి రూ.400 -450 కోట్లు ఆదాయంగా రాష్ట్ర ఖజానాకి జమవుతాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై అవగాహన లేకుండా అసలేమాత్రం నిజం లేకుండా వార్తలు రాస్తున్నారని బుగ్గన మండిపడ్డాహరు.

 అబద్ధాలు నిజం కాబోవన్న బుగ్గన

అబద్ధాలు నిజం కాబోవన్న బుగ్గన


మీకు నచ్చని, మీకు సరిపోని, మీకు కావలసింది చేయని ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడల్లా మీ వ్యూహమిదేనని ఎల్లో మీడియాను ఉద్దేశించి బుగ్గన వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తా కథనాలు రాయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పౌరులకేమైనా ప్రయోజనముందా? ఇలాంటివి ప్రచురించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఏ అవగాహనతో, ఏ ఆధారాలతో ఇలా అసత్యాలు రాస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఆర్థిక పరిస్థితులు, రుణాలు, బకాయిలు, సర్దుబాట్లు, జీతాలివ్వలేని పరిస్థితి, ఖజానా ఖాళీ అని మీరెన్ని రకాల శీర్షికలతో అవే అవే అబద్ధాలు రాసినా అవి ఎన్నటికీ నిజాలు కాబోవన్నారు పైగా మీరు రాసే అర్థం లేని అబద్ధపు రాతలకు ఆర్థిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడాల్సిన అవసరం ఉందా? ఊరికే చదివి నవ్వుకోవడం తప్ప అన్నారు.

English summary
ap finance minister buggana rajendranath on today issued rejoinder on rumours about central govt's taken back of gst compensation issued to ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X