ఏపీలో సీపీఎస్ మిలియన్ మార్చ్-ఉద్యోగులకు పిలుపు-తేలకపోతే సెప్టెంబర్ 1న ముట్టడి...

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. గతంలో ఛలో విజయవాడ తర్వాత ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి దాని స్ధానంలో జీపీఎస్ రద్దుకు ప్రతిపాదించింది. అయితే ఉద్యోగులు దాన్ని అంగీకరించడం లేదు. దీంతో ప్రభుత్వం ఇవాళ మరోసారి ఉద్యోగసంఘాల్ని చర్చలకు ఆహ్వానించింది.

 సీపీఎస్ రద్దుపై మిలియన్ మార్చ్

సీపీఎస్ రద్దుపై మిలియన్ మార్చ్


ఏపీలో ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించపోవడంతో ఉద్యోగులు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. సీపీఎస్ విధానం రద్దుకు తాము డిమాండ్ చేస్తుంటే దాన్ని ఒప్పుకున్నట్లే ఒప్పుకుని జీపీఎస్ పేరుతో మరో కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో వచ్చే నెల 1న మిలియన్ మార్చ్ పేరుతో తాడేపల్లిలోని సీఎం నివాసం ముట్టడిస్తామని ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. ఈ హెచ్చరికలు ప్రభుత్వానికి తాకాయి.

 చర్చలకు రమ్మని పిలుపు

చర్చలకు రమ్మని పిలుపు

సీపీఎస్ రద్దు చేసి దాని స్ధానంలో జీపీఎస్ అమలుచేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ చర్చలకు రావాలని సర్కార్ ఆహ్వానించింది. గతంలో సీపీఎస్ రద్దుపై చర్చల్లో పాల్గొన్న మంత్రుల కమిటీతో ఇవాళ సచివాలయంలో సాయంత్రం ఐదు గంటలకు చర్చలు నిర్వహిస్తారు. ఇందులో భాగస్వాములు కావాలని నాలుగు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో పాటు సీపీఎస్ ఉద్యమం సాగిస్తున్న ఉద్యోగసంఘాలకు కూడా పిలుపువచ్చింది.

 సీపీఎస్సా, జీపీఎస్సా ?

సీపీఎస్సా, జీపీఎస్సా ?

ఉద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌పై చర్చించేందుకు వైసీపీ సర్కార్ ఉద్యోగ సంఘాలను నేడు చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో సంప్రదింపుల కమిటీతో సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నాయకులకు ఆహ్వానం పలికింది.సచివాలయం రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, సీపీఎస్ రద్దు చేస్తే భారీగా చెల్లింపులు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ఇదే విషయాన్ని మరోసారి ఉద్యోగసంఘాలకు వివరించబోతోంది. అయితే దాన్ని ఉద్యోగులు అంగీకరిస్తారా లేక సీపీఎస్ రద్దుకే పట్టుబడతారా అన్నది ఇవాళ తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+