• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబాయ్ కి జగన్ మరో ఝలక్- మోపిదేవికి రాజధాని బాధ్యతలు - వైసీపీలో మరో పవర్ గేమ్ ?

|

ఏపీలో అధికారం చేపట్టిన ఏడాది పూర్తయిన సందర్బంగా ముగ్గురు కీలక నేతలకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు కట్టబెట్టిన జగన్ అంతలోనే ఒకదాని వెంట మరొక మార్పు చేస్తున్నారు. ఇప్పటికే గతంలో ముగ్గురు మోసిన పార్టీ బాధ్యతల్లో మరొకరిని తీసుకొచ్చిన జగన్.. తాజాగా మరో మార్పు చేశారు. పార్టీకి ఎప్పటినుంచో విధేయుడిగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ఈ మార్పు పార్టీలో అంతర్గత పోరు కారణంగా జరిగిందా లేక భవిష్యత్ రాజకీయాల కోసమే చేశారా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. అంతిమంగా పార్టీలో కీలకంగా ఉన్న నేత బాధ్యతల్లో కోత పడటం చర్చనీయాంశమవుతోంది.

మొండితనమా, సానుభూతి కోసమా ? వరుస ఎదురుదెబ్బలతో తీరు మార్చుకోని జగన్ సర్కార్...

 వైసీపీ బాధ్యతల్లో మరో మార్పు...

వైసీపీ బాధ్యతల్లో మరో మార్పు...

ఏపీలో వైసీపీ సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీని కూడా పటిష్టం చేయాలని భావించిన అధినేత జగన్ .. రాష్ట్రవ్యాప్తంగా 13 జల్లాల బాధ్యతలను ముగ్గురు నేతలకు అప్పగించారు. దీని ప్రకారం పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి జిల్లాల బాధ్యతలు దక్కాయి. ఆ తర్వాత గత నెలలో సజ్జలకు అప్పగించిన జిల్లాల్లో రెండింటిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. తాజాగా మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డికి అప్పగించిన జిల్లాల్లో రెండింటిని మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణకు కట్టబెట్టారు. ప్రస్తుత రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణా, గుంటూరు జిల్లాలు మోపిదేవికి అప్పగించారు. దీంతో పార్టీలో ఆ ముగ్గురే కాదు మరో ఇద్దరు కూడా కీలకమని తేలిపోయింది.

 బాబాయ్ కి జగన్ ఝలక్ ?

బాబాయ్ కి జగన్ ఝలక్ ?

వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకరు. పార్టీని అధికారంలోకి తెచ్చే క్రమంలో ఒంగోలు ఎంపీ సీటును కూడా ఆయన త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన్న రాజ్యసభకు పంపుతారని భావించినా జగన్ మాత్రం టీటీడీ ఛైర్మన్ గిరీ కట్టబెట్టారు. ఆ తర్వాత అయినా రాజ్యసభకు పంపుతారనుకుంటే సమీకరణాలు కలిసి రాలేదు. అప్పట్లో దీనిపై వైవీ అలకబూనారని కూడా వార్తలొచ్చాయి. చివరికి పార్టీ తరఫున జిల్లాల బాధ్యతలు అప్పగించినా అందులో తాజాగా కీలకమైన రెండు జిల్లాల్లో కోతపెట్టారు. అవి రాజకీయంగా కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాలు కావడంతో బాబాయ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.

 సర్దుబాటులో భాగమేనా ?

సర్దుబాటులో భాగమేనా ?

వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన వారిలో చాలా మందే ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వీరి అంచనాలు అమాంతం పెరిగాయి. వీటిని అందుకోవడం ఓ దశలో అధినేత జగన్ కు కూడా సాధ్యం కావడం లేదు. అలాగని సమీకరణాలు, లెక్కలు చూసుకోకుండా ముందుకెళ్లే పరిస్ధితి లేదు. దీంతో జగన్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటివరకూ రాజధాని అమరావతిలో భాగమైన కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ బాధ్యతలను చూసిన వైవీ సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీకి సంచలన విజయాలు అందించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వైసీపీని ఆధిక్యంలో నిలపడంలో వైవీదే ప్రధాన పాత్ర. అయితే మారిన పరిస్ధితుల్లో ఇదే ప్రాంతానికి చెందిన మోపిదేవికి పగ్గాలు అప్పజెప్పడం ద్వారా స్ధానిక నేతలకు అందుబాటులో ఉంచాలని జగన్ భావించారా అన్న చర్చ జరుగుతోంది.

  Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్
   జగన్ ముందస్తు వ్యూహం ?

  జగన్ ముందస్తు వ్యూహం ?

  వైసీపీలో నిన్న మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి రూపంలో ముగ్గురు కీలక నేతల పేర్లే వినిపించేవి. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు పంచిన జగన్.. ఇప్పుడు మోపిదేవినీ రంగంలోకి దింపారు. పార్టీలో నమ్మకమైన నేతగా ఉన్న మోపిదేవికి కూడా వీరితో సమానంగా జిల్లాల బాధ్యతలను పంచడం ద్వారా వైసీపీని భవిష్యత్ రాజకీయాలకు తగ్గట్టుగా పటిష్టంగా మార్చాలనే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. అందుకే ఏ ఒక్కరికీ పూర్తిస్దాయిలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు. బహుళ అధికార కేంద్రాలను నెలకొల్పడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్న ముందస్తు వ్యూహం కూడా ఇందులో ఉందనే ప్రచారం సాగుతోంది.

  English summary
  ysr congress party president ys jagan revised his party responsibilities as mp mopidevi venkataramana replaces yv subbareddy for incharge to krishna and guntur districts .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more