జగన్‌పై హత్యాయత్నం కేసు..! వ‌చ్చేనెల 12 కి వాయిదా..!!

విజయవాడ/హైద‌రాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. హైకోర్టు ఆదేశం మేరకు బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారం రోజుల సమయం కోరారు. గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో హైకోర్టు వచ్చే నెల 12కు కేసు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణపై గతంలోనే రాష్ట్రప్రభుత్వం సిట్ ఫైల్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం ఈ మేరకు వాయిదా వేసింది.

Jagans cock knife case..! postponed to Feb 12th..!!

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్ట్‌లో రిట్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. వెంటనే ఎన్‌ఐఏ విచారణపై స్టే విధించాలని ప్రభుత్వం ఈ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా తక్షణమే విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. గత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్‌పై ఎన్‌ఐఏ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయగా.. తమ వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+