‘శభాష్ వర్ష’: కూతురు కోసం లండన్‌కు జగన్, ఎందుకంటే..?
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించింది. వర్ష అడ్మిషన్ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.

కూతురు కోసం లండన్‌కు జగన్
సెప్టెంబర్ 11న జగన్.. కుటుంబసమేతంగా లండన్ వెళ్తున్నారని, కూతురిని అక్కడ్ జాయిన్ చేసి 19వ తేదీన తిరిగి రానున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, గతంలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో వర్షకు సీటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

రోజా ప్రశంలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూతురు వర్ష రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సాధించిందని, జగన్ గర్వించేలా చేసిందని గతంలో వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఇద్దరు కూతుళ్లు..
జగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు వర్ష, హర్ష. వీరు చాలా లోప్రొఫైల్‌గా ఉంటారు. దగ్గరి వారు తప్పించి వారిని బయటి వారు పెద్దగా గుర్తు పట్టరు. హంగు, ఆర్భాటాలు కనిపించవు. అయితే ఇప్పుడు జగన్ దంపతులు గర్వించే ఘనత సాధించారు.

అక్కడ సీటు ఆషామాషీ విషయం కాదు..
పెద్ద కుమార్తె వర్ష ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సాధించింది. లండన్ లోని ఈ విద్యాసంస్థల్లో సీటు సాధించడం ఆషామాషీ కాదు. ప్లస్ టూలో 99% శాతం మార్కులు వచ్చి ఉండాలి. సీటు కోసం ఎంట్రాన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిని జగన్ కుమార్తె వర్ష విజయవంతంగా జయించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సొంతం చేసుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో వర్ష సీటు సాధించడంతో జగన్ కుటుంబసభ్యుల ఆనందానికి అవదుల్లేవు. జగన్ చిన్న కుమార్తె హర్ష కూడా చాలా బ్రిలియంట్ అని చెబుతున్నారు. జగన్ చిన్న కుమార్తె మంచి మాటకారి అని తెలిసిన వారు చెబుతుంటారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications