వాళ్లది దష్టచతుష్ఠయం : యాక్టర్..డైరెక్టర్ ల పార్టీలు వేర్వేరు కాదు: మంగళగిరిలో జగన్ ఫైర్
Recommended Video

మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిసే వేళ..వైసిపి అధినేత జగన్ తన వాయిస్ ను మరింత పెంచారు. మంగళ గిరి లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో లోకేశ్ పేరెత్తకుండానే ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఈ సారి ఓటమి ఖాయమని చెప్పారు. పవన్..చంద్రబాబు వేర్వేరు పార్టీలా..ఒకటే పార్టీనా అంటూ ప్రశ్నించారు. ఆత్మగౌర వం గురించి మాట్లాడే పవన్ కు రైతుల భూములు సింగపూర్ కు అమ్ముతుంటే ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అన్నారు.

యాక్టర్..బాబు ఒకటే పార్టీనా..
మనోసారి పవన్ పేరెత్తకుండానే యాక్టర్ అంటూ పవన్ కళ్యాన్ పై జగన్ విమర్శలు చేసారు. యాక్టర్..బాబు ది వేర్వేరు పార్టీలా..లేక ఒకటే పార్టీయా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాన్ పోటీ చేసే నియోజకవర్గాలైన గాజువాక..భీమవరం లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రచారం చేయరని..అదే విధంగా చంద్రబాబు, ఆయన తనయుడు పోటీ చేస్తున్న కుప్పం..మంగళగిరి లో పవన్ ప్రచారం చేయరని..దీనిని ఏమనాలని ప్రశ్నించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే పవన్ కళ్యాన్..ఎల్లో మీడియా రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాలు సింగపూర్ సంస్థకు రియల్ ఎస్టేట్ కోసం అప్పగి స్తే అప్పుడు ఆత్మాభిమానం గుర్తుకు రాదా అని జగన్ నిలదీసారు. ఎన్ని కుట్రలు చేసినా..ఈ సారి చంద్రబాబు ఓటమి నుండి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.

వాళ్లది దుష్టచతుష్ఠయం..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే అరాచకాలు..మోసాలు ఎల్లో మీడియా కు కనిపించవా అని జగన్ ప్రశ్నించారు. మీడియాలో ఈనాడు..ఆంధ్రజ్యోతి..టివి 5..టివి 9 ను దుష్టచతుష్ఠయంగా అభివర్ణించారు. ఓటు కు నోటు కేసులో అడ్డం గా దొరికిపోయి హైదరాబాద్ పై పదేళ్లు మనకు అధికారం ఉన్నా..పారిపోయి ఇక్కడకు వచ్చారని విమర్శించారు. ఇక్క డ రాజధాని విషయం పై ముందుగానే తన వాళ్లకు చెప్పి..ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడ సొంత ఇల్లు తాను కట్టుకుంటే..చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారని విమర్శించారు. ఓటుకు పదివేలు ఇస్తున్నార ని చెబుతున్నారని..ఆ ప్రలోభాలకు మంగళగిరి ప్రజలు లొంగరని జగన్ పేర్కొన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి వైయస్ తరహా పాలన చూడాలని అభ్యర్దించారు.

లోకేశ్ కు ఓటు వేస్తే..
మంగళగిరిలో టిడిపికి ఓటు వేస్తే భూములు మిగలవని జగన్ ఆరోపించారు. ఇప్పటికే హాయ్‌లాండ్ భూములను.. సదావర్తి భూముల విషయంలో ఏం చేసారో చూసామని గుర్తు చేసారు. లాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన భూములు ఇవ్వకుండానే..రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి..ఆయన కుమా రుడు ఏనాడు మంగళగిరిలో తిరగలేదని పేర్కొన్నారు. ఆర్కేకు ఓటు వేస్తే మీ ఆస్తులు కాపాడుతాడని చెప్పారు. మీ అభివృద్దిలో తోడు గా ఉంటాడని వివరించారు. వైసిపి అధికారంలోకి వస్తే ఆర్కే మంత్రి అవుతాడని ప్రకటించారు.












Click it and Unblock the Notifications