జగన్ ఆస్తుల్లో సగం షర్మిలకు-రఘురామ సంచలనం-విజయసాయి సిద్ధాంతం ప్రకారమే-ఆ విషయంలో వెంకన్న భక్తులు ప్రతిఘటించాలని

వైసీపీ ప్రభుత్వ విధానాలు,ఆ పార్టీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్న రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు... తాజాగా సీఎం జగన్ వ్యక్తిగత అంశంపై స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తుల్లో సగం ఆస్తులను ఆయన సోదరి షర్మిలా రెడ్డికి ఇవ్వాలని అన్నారు.జగన్ విజయంలో సగం పాత్ర పోషించిన షర్మిలకు సగం ఆస్తులు దక్కాల్సిందేనన్నారు. విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం... ఆ బాధ్యత జగన్‌పై ఉందన్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో మహిళలను వారసులుగా అంగీకరించకపోవడాన్ని తప్పు పడుతూ విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ రఘురామ ఈ వాదనను తెర పైకి తీసుకొచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో మహిళలను వారసులుగా గుర్తించాలని విజయసాయి రెడ్డి చెబుతున్నప్పుడు... వైఎస్సార్ తనయగా సీఎం జగన్ ఆస్తుల్లో షర్మిలకు సగం వాటా వస్తుందని అంటున్నారు.

విజయసాయి సిద్దాంతం ప్రకారమే : రఘురామ కృష్ణరాజు

విజయసాయి సిద్దాంతం ప్రకారమే : రఘురామ కృష్ణరాజు

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజునే నియమించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ సర్కార్‌కు చుక్కెదురైనట్లయింది. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన విజయసాయి రెడ్డి... 'పురుష వారసులు లేని రాజ్యాలను కొట్టేయడానికి ... ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కుట్రలకు వ్యతిరేకంగా రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్, రాణి చెన్నమ్మ వీరోచితంగా పోరాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. డల్హౌసీ సిద్ధాంతానికి అశోక్ పూసపాటి ఆలోచనలకు ఏమైనా తేడా ఉందా? ఇంకా ఈస్టిండియా కంపెనీ సిద్ధాంతాలనే పాటిస్తూ 'కప్పం' కట్టే సామంతరాజు బుద్ధి పోనిచ్చుకోలేదు. మహిళలను వారసులుగా అంగీకరించని ఫ్యూడల్‌ వ్యవస్థ కాదిది. మహిళలకు సమాన హక్కులు కల్పించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో జగన్-షర్మిల ఆస్తుల అంశంపై రఘురామ స్పందించారు. విజయసాయి చెప్పిన సిద్దాంతం ప్రకారం జగన్ ఆస్తుల్లో షర్మిలకు సగం వాటా రావాలన్నారు.

వేటుకు ఆస్కారమే లేదు : రఘురామ

వేటుకు ఆస్కారమే లేదు : రఘురామ

తనపై అనర్హత వేటుకు వైసీపీ సాగిస్తున్న ప్రయత్నాలపై రఘురామ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును వైసీపీ నేతలు కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. అనర్హత వేటుకు నిర్ణీత గడువు విధించేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు సవరణ చేయాలని వైసీపీ నేతలు కేంద్రమంత్రిని కోరారని అన్నారు. నిజానికి తాను పదో షెడ్యూల్‌ను ఎక్కడా ఉల్లంఘించలేదని... కాబట్టి తనపై వేటుకు ఆస్కారమే లేదని అన్నారు. తాను ఎన్నడూ పార్టీ విప్‌ను ధిక్కరించింది లేదని... వేరే పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాసినట్లు చెప్పారు.

కోర్టును తరలించడం అంత సులువు కాదు : రఘురామ

కోర్టును తరలించడం అంత సులువు కాదు : రఘురామ

హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కేంద్రమంత్రికి వైసీపీ నేతలు చేసిన విజ్ఞప్తిని రఘురామ తప్పు పట్టారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశం.. ఇంకా ఎటూ తేలకముందే న్యాయశాఖ మంత్రిని ఇలా కోరడమేంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని... కాస్త సంయమనం పాటించాలని అన్నారు. పార్టీ హెడ్ క్వార్టర్స్‌ను మార్చినంత సులువుగా కోర్టులను తరలించరని ఎద్దేవా చేశారు. 20 మంది పార్టీ నేతలను వెంటపెట్టుకుని వెళ్లినంత మాత్రానా వెంటనే పని జరగదని అన్నారు. కోర్టులో తేలేంతవరకూ కాస్త ఓపిక పట్టాలన్నారు.

కేంద్రంపై నింద మోపుతూ రైతులకు అన్యాయం : రఘురామ

కేంద్రంపై నింద మోపుతూ రైతులకు అన్యాయం : రఘురామ

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదని... కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికే ఇచ్చేశామని కేంద్రం చెబుతోందన్నారు. దీనిపై లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారని చెప్పారు. దాని ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 4 నాటికి రూ.6500 కోట్లు,జూన్ 25 నాటికి రూ.686 కోట్లు,జులైలో రూ.2వేల పైచిలుకు కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులన్నీ పరిశీలించి ఆహార సబ్సిడీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేశారని చెప్పారు. కేంద్రం నుంచి ఇక రాష్ట్రానికి ఇచ్చేది ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అయినప్పటికీ కేంద్రంపై నింద మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇంకా చెల్లింపులు జరపట్లేదని మండిపడ్డారు.

టీటీడీ కామన్ గుడ్ ఫండ్.. భక్తులు ప్రతిఘటించాలంటూ...

టీటీడీ కామన్ గుడ్ ఫండ్.. భక్తులు ప్రతిఘటించాలంటూ...

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను ఢిల్లీలో ఉంటున్నానని... ఢిల్లీలో తన సేవలు వాడుకోవాలని రఘురామ కృష్ణరాజు వైసీపీ సర్కార్‌ను కోరారు.టీటీడీ నుంచి కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) ఇది వరకు రూ.1.50కోట్లు ఉండగా... ఇప్పుడు దాన్ని రూ.50 కోట్లకు పెంచడాన్ని రఘురామ ఆక్షేపించారు. మౌజంలు,పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇచ్చే ప్రభుత్వం అర్చకులకు మాత్రం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. కామన్ గుడ్ ఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భక్తులు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వం వచ్చే ఏడాది దాన్ని రూ.500 కోట్లుకు పెంచుతుందన్నారు. అంతేకాదు,ఆర్టీసీని విలీనం చేసినట్లు... టీటీడీ ఆదాయాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తారని అన్నారు. కాబట్టి వెంకటేశ్వరస్వామి భక్తులంతా దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం పంపుదామని.. వెంకన్న జోలికి రావొద్దని మొరపెట్టుకుందామని అన్నారు. టీటీడీలో ఉన్న ట్రిపుల్ ఆర్‌లు... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,అదనపు ఈవో ధర్మారెడ్డి,ఈవో జవహర్ రెడ్డిలు కలిసి కామన్ గుడ్ ఫండ్‌ను రూ.50 కోట్లు చేశారన్నారు.

మాన్సాస్ వివాదంపై...

మాన్సాస్ వివాదంపై...


మాన్సాస్ ట్రస్ట్ వివాదంపై స్పందిస్తూ... అశోక్ గజపతిరాజు విషయంలో ఎన్నిసార్లు కోర్టుకు వెళ్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంత ప్రజాధనం ఖర్చు పెడుతారని నిలదీశారు. సుమారు 175 అవసరం లేని కేసులు ఇప్పటికే ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఇంత ప్రజాధనం వృథా చేయడంపై ఇవాళ కాకపోతే రేపైనా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆడియో టేపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఇందులో కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉండవచ్చునని... కానీ అంబటి రాంబాబు అంటే గిట్టనివాళ్లే ఇదంతా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అంబటికి మంత్రి పదవి వస్తుందేమోనని సొంత పార్టీ వాళ్లే ఇలా చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+