జగన్! దూడల రాజేష్ ఎవరో చెప్పు: 'కాల్ మనీ'పై బొండా ఉమ

హైదరాబాద్: కాల్ మనీ కేసులో నిందితుడు దూడల రాజేష్ వైసిపి అధ్యక్షులు జగన్ అనుచరుడు అని విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు గురువారం అన్నారు. శాసన సభ పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం బొండా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

కాల్ మనీ పైన ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాద్దాంతం చేయడం విడ్డూరమన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. జ్యూడిషియల్ విచారణలో నిజానిజాలు బయటకు తీస్తామని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు వైసిపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Jagan should say, Who is Rajesh: Bonda Uma

కాల్ మనీ నిందితుడు దూడల రాజేష్ వైసిపి అధినేత జగన్ అనుచరుడు అని ఆరోపించారు. రాజేష్ ఎవరో జగన్ సమాధానం చెప్పాలని బొండా ఉమ నిలదీశారు. కాల్ మనీలో ఎవరున్నా కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

పదేళ్లుగా కాల్ మనీ దందా ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దానిని కూకటి వేళ్లతో పెకిలించిందన్నారు. కాల్ మనీ పైన రేపు సమగ్ర చర్చకు సిద్ధమని చెప్పారు. చర్చకు సిద్ధమని చెప్పినా వైసిపి నేతలు ఆందోళన చేయడం విడ్డూరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+