"బాబుకు ముందే తెలుసు.. సాఫీగా జరగలేదు కాబట్టే ఇప్పుడిలా!"

అంతా సాఫీగా సాగిపోయి ఉంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించేవారని విమర్శించారు.

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముందస్తు సమాచారం అందిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ముందస్తు సమాచారం ఉంది కాబట్టే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి సరిగ్గా రెండు రోజుల ముందు హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ కు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుందామనుకున్న చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా మారాయని, అందుచేతనే మోడీ నిర్ణయం బ్యాడ్ అని ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తున్నారని జగన్ అన్నారు. అంతా సాఫీగా సాగిపోయి ఉంటే ఆ నిర్ణయంలో క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించేవారని విమర్శించారు.

Jagan takes on Chandrababu naidu over demonetisation

చంద్రబాబు సహా ఆయన అనుచరులంతా తమ లావాదేవీలను ముందే చక్కబెట్టుకున్నారని, కేవలం పేదవాళ్లు మాత్రమే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ దాడుల్లో బడాబాబుల ఇళ్లల్లోనే కోట్లకు కోట్ల కొత్త నోట్లు దొరుకుతున్నాయని, ఇది బ్లాక్ మనీ మీద జరుగుతున్న పోరాటమా, లేక పేదలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న ఆరాటమా అని జగన్ ప్రశ్నించారు.

మనదేశం 90శాతం నగదు ఆధార ఆర్థిక వ్యవస్థేనని, వ్యవసాయ రంగం మొత్తం నగదు లావాదేవీల మీదనే ఆధారపడిందని జగన్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+