వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో హామీ నిలబెట్టుకుంటున్న జగన్- ఆగస్టు 1 నుంచి అమలుకు ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవెర్చుకుంటూ వస్తున్న సీఎం జగన్... తాజాగా మరో హామీ అమలుకు ఆదేశాలు ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు, వికలాంగులకు, వితంతువులకు మేలు జరగనుంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 1 నుంచి ఈ హామీ అమలయ్యేలా అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.

jagan to fulfill another poll assurance as pensioners get hike from august 1st

వైసీపీ నవరత్నాల్లో భాగంగా పేదలకు గతంలో ఉన్న 2 వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని నాలుగేళ్లలో 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచనున్నారు. తొలి ఏడాది అధికారం చేపట్టగానే పింఛను మొత్తాన్ని 2 వేల నుంచి 2250కు పెంచిన జగన్ .. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి దాన్ని 2500కు పెంచబోతున్నారు. మరో రెండేళ్లలో ఈ మొత్తం 3 వేలకు చేరుకోనుంది. అప్పుడు జగన్ ఇచ్చిన మరో హామీ పూర్తిగా నెరవేరినట్లవుతుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జగన్ తాజాగా అధికారులను ఆదేశించారు.

English summary
andhra pradesh has decided to hike pension amount from rs.2250 to 2500 from august 1st. keeping his poll promise cm jagan has order to implement this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X