Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ వర్సెస్ లోకేష్.. ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

ఏపీ రాజకీయాలలో విమాన ప్రయాణాల ఖర్చు అంశం హాట్ టాపిక్ అయింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో విమాన ప్రయాణాల కోసం రాష్ట్ర ఖజానా నుండి ఏకంగా 222 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తోంది. జగన్ వర్సెస్ లోకేష్ రగడతో ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు? అన్నది చర్చనీయాంశం అయ్యింది.

వైసీపీకి టీడీపీ రివర్స్ కౌంటర్
మంత్రి నారా లోకేష్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వైసిపి టార్గెట్ చేసిన క్రమంలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీకి రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల వైసిపి నారా లోకేష్ వీకెండ్స్ లో తరచుగా హైదరాబాద్ వెళుతున్నారని, దీనికోసం చార్టర్డ్ విమానాలను వాడుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసిపి నారా లోకేష్ లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేసింది.

Jagan vs Lokesh Who enjoyed luxuries and flight journeys with public money hot debate

లోకేష్ పర్యటనలకు శాఖాపరమైన ఖర్చుపై క్లారిటీ
అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కొడమల సురేష్ అనే వ్యక్తి ఆర్టిఐ ద్వారా లోకేష్ విమాన ప్రయాణ ఖర్చుల వివరాల సమాచారం కోసం ఆర్టిఐ కు దరఖాస్తు చేయగా, లోకేష్ పర్యటనలకు శాఖా పరంగా ఎటువంటి ఖర్చులు చెల్లించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

లోకేష్ ఖర్చులు ఇందులో నుండే
సమాచార సాంకేతికత, రియల్ టైం గవర్నెన్స్, ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి కీలకమైన శాఖలను నిర్వహిస్తున్న మంత్రి లోకేష్ తన 77 హైదరాబాద్ ట్రిప్పులకు అయ్యే ఖర్చులను తన సొంత జేబు నుండి ఖర్చు చేసుకున్నట్టు దానికోసం ప్రభుత్వ నిధులను ఇవ్వలేదని పేర్కొంది. ఈ విషయమై వైసీపీ చేసిన ఆరోపణలను ఆర్టిఐ ఇచ్చిన సమాచారంతో టార్గెట్ చేస్తున్న టిడిపి, వైసిపి వాదన అవాస్తవమని కొట్టిపారేసింది.

జగన్ జల్సాల ఖర్చులు రూ.222.85 కోట్లు: టీడీపీ టార్గెట్
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయాణ ఖర్చుల కోసం ఎంత ఖర్చు చేశారో తాజాగా కొత్త గణాంకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పత్రాల ప్రకారం వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాప్టర్, విమాన ప్రయాణాల కోసం రూ.222.85 కోట్లను ప్రజా నిధుల నుండి ఖర్చు చేసినట్టు పేర్కొంది.

టిడిపి, వైసిపిల మధ్య రాజకీయ రగడ
ఈ వ్యాఖ్యల పైన స్పందించిన వైసిపి తండ్రి చంద్రబాబు లేకపోతే లోకేష్ మంత్రి అయ్యేవాడు కాదని విమర్శలు గుప్పించింది. అబద్దాలను ప్రచారం చేయడం వల్ల లోకేష్ ప్రావీణ్యం సంపాదించారని టార్గెట్ చేసింది. తండ్రి చంద్రబాబు భారత రాజకీయాల్లో అబద్దాలకు ఛాంపియన్ అంటూ పేర్కొంది. ప్రతిరోజు కనీసం ఒక్క అబద్ధాన్ని పోస్ట్ చేయకుండా చంద్రబాబు లోకేష్ నిద్రపోలేరు అనేది నిజమేనా? అంటూ చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాదం టిడిపి, వైసిపి ల మధ్య రాజకీయ రగడకు కారణమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+