వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం...జగన్ సోదరుడు మృతి

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్‌రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Jagan s brother Abhishek Reddy passed away

అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్​ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్​ అభిషేక్‌రెడ్డి.గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహారించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.అయితే ఆయన కేవలం పార్టీ బాధ్యతలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఆయన ప్రస్తుతం వైసీపీ వైద్య విభాగానికి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.బుధవారం పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఈ అంత్యక్రియలకు జగన్‌తో సహా వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+