ఆ పత్రికకు 1600 కోట్ల ప్రజాధనం.. గత సర్కారుపై గొట్టిపాటి సంచలనం
గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి జల్సాలు, అవినీతితో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు.
తమకు న్యాయం చేయాలంటూ.. రాష్ట్రం నలుమూలల నుంచి జగన్ బాధితులు ఎన్టీఆర్ భవన్‌కు బారులు తీరుతున్నారని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ భూ దందాలు, ఆర్థిక నేరాల నుంచి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలకులు ఉద్దేశపూర్వకంగా చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కమీషన్ల పాలన, ఆర్థిక నేరాలతో రాష్ట్రం దివాళాతీసే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి గొట్టిపాటి ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృధా చేశారన్నారు. ప్రచార పిచ్చితో సాక్షి పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టారని మంత్రి గొట్టిపాటి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్‌ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లని మంత్రి గొట్టిపాటి చెప్పుకొచ్చారు.
అభివృద్ధికి తెచ్చిన అప్పుల్లోనూ జగన్ చేతివాటం
రాష్ట్ర అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల్లోనూ కమీషన్లతో జగన్ చేతి వాటం చూపారన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రూ. పది లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్య శ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌కు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పుపాలన కారణంగా రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని దుస్థితి దాపురించిందన్నారు. జగన్ రెడ్డి చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ. 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు. వ్యవసాయ రంగానికి కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతులకు తీరని నష్టం చేసిందన్నారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ శాఖకు చెందిన కాంట్రాక్టర్లకు రూ.19,000 కోట్లు మేర వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. ఈ బకాయిల ప్రభావం ప్రస్తుత ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి గొట్టిపాటి అసహనం వ్యక్తం చేశారు.
చిన్నారుల చిక్కీలను బొక్కేశారంటూ ఫైర్
చిన్నారులకు అందించే చిక్కీలు, కోడిగుడ్ల నిధుల్లోనూ జగన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం గోల్ మాల్ చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. చిక్కీలు, కోడిగుడ్ల కొనుగోళ్లలో దాదాపు రూ. 256 కోట్ల నిధులు పక్కదారి పట్టాయన్నారు. జే బ్రాండ్ పేరుతో లిక్కర్, 22ఏ భూ దందా, టీడీఆర్ బాండ్లు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణం, ఇసుక దోపిడీతో సామాన్యులు రాష్ట్రంలో జీవించలేని పరిస్థితులు తీసుకువచ్చారని మంత్రి పేర్కొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications