దాడి కేసు: జిల్లా కోర్టులో లొంగిపోయిన జగ్గారెడ్డి

మెదక్: మెదక్ పార్లమెంటరీ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక జిల్లా కోర్టులో లొంగిపోయాడు. 2011-12లో సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నర్సింహులు అనే వ్యక్తి రేషన్ బియ్యం బాగోలేదని ఆరోపించడంతో జగ్గారెడ్డి అతనిపై చేయి చేసుకున్నారు.

ఆ తర్వాత 2012లో జగ్గారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న జెఏసి నాయకులపై దాడి కేసులో జగ్గారెడ్డిపై వారెంట్ జారీ అయింది. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయినట్లు సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న తెలిపారు. కాగా, ఆ తర్వాత జగ్గారెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు.

Jagga Reddy surrendered in district court

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన జగ్గారెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో అధికారం కోల్పోవడంతో ఆయన పార్టీ కార్యకలాపాలు కొంత దూరంగా ఉన్నారు.

మెదక్ పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నా. దీంతో ఆయననే మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థిగా తెలంగాణ శాఖ ప్రకటించింది. మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థిగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+