మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ డిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి: మెదక్ అభ్యర్థి?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Jagga Reddy will be Medak DCC president
న్యూఢిల్లీ: మెదక్ జిల్లా కాంగ్రెసు జిల్లా కమిటి (డిసిసి) అధ్యక్షుడిగా కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియఆస్ జగ్గారెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు కూడా సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యర్థిగా, ఆయనను నిత్యం తప్పు పట్టే నేతగా జగ్గారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చినట్లయింది.

మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, జగ్గారెడ్డి టికెట్ దక్కించుకుని, తెరాసను ఢీకొనడానికి సిద్ధపడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, తెలంగాణలో మరో రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు సంబంధించి మూడు జిల్లాలు మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్‌లకు సంబంధించి డిసిసి అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా కె. మల్లేష్, అదిలాబాద్ జిల్లా డిసిసి దేశ్‌పాండే నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి జనార్థన్ ద్వివేది గురువారం ప్రకటన విడుదల చేశారు. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచన మేరకే ఆ ముగ్గురి నియామకం జరిగినట్లు భావిస్తున్నారు.

English summary

 Sangareddy former MLA Turpu Jayaprakash Reddy alias Jagga Reddy has been appointed as Medak DCC president by president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X