జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో లైంగిక వేధింపులు ? యూఎస్ రిటర్న్ ఏపీ దంపతుల షాకింగ్..

తమిళనాడులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ ఆశ్రమం మరో తీవ్ర ఆరోపణ ఎదుర్కొంటోంది. తాజాగా ఇద్దరు మహిళల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన ఇషా ఫౌండేషన్ పై అమెరికా నుంచి రిటర్న్ అయిన ఓ ఆంధ్రప్రదేశ్ జంట లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆశ్రమంలో ఏం జరుగుతందో వారు పూసగుచ్చినట్లు డెక్కన్ హెరాల్డ్ వెబ్ సైట్ కు వివరించారు.

రాగాని సత్యనరేంద్ర, యామిని అనే దంపతులు దశాబ్దానికి పైగా ఇషా ఫౌండేషన్ లోనే ఉన్నారు. ఈ ఆశ్రమ కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత యూఎస్ లో ఉంటున్నారు. వీరి కుమారుడిని ఇషా ఫౌండేషన్ నడుపుతున్న హోమ్ స్కూల్ లో ఉంచారు. అక్కడ తమ కుమారుడిపై మరో బాలుడు మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై ఆశ్రమం వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అందుకే మీడియాను ఆశ్రయిస్తున్నట్లు ఈ దంపతులు తెలిపారు.

jaggi Vasudev s isha foundation now facing sexual harassment allegation by US returned ap couple

గతంలో ఇదే స్కూల్లో ఓ 8 ఏళ్ల బాలిక వ్యాయామ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వారు ఆరోపించారు.ఇలా పిల్లలు రేప్ కు గురవుతున్నా, చనిపోతున్నా ఆశ్రమం నుంచి ముఖ్యంగా సద్గురు నుంచి ఎలాంటి స్పందన లేదని దంపతులు ఆరోపిస్తున్నారు. భారతీయ విలువలు, సంస్కృతితో తమ బాబును చదివించాలని ఈ ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడ ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నట్లు వారు తెలిపారు. దీనిపై ఆశ్రమం దృష్టికి తెస్తే తమ బాలుడినే తప్పుబడుతున్నట్లు కూడా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+