వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చిన జైళ్ల శాఖ..
ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి ఇంకా నాలుగు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
మరోవైపు మిథున్ రెడ్డికి జైలులో ప్రత్యేక సౌకర్యాలు, ఇంటి భోజనం అనుమతించే విషయంలో కూడా వివాదం నడుస్తోంది. ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎంపీకి సహాయకుడిని (అటెండర్) ఏర్పాటు చేయాలని సూచించగా.. దీనిపై రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

జైలు నిబంధనల ప్రకారం ఖైదీకి సహాయకుడిని ఇవ్వడం అనుమతించబడదని.. జైలు సూపరింటెండెంట్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శారీరకంగా స్వయంగా పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నా.. తీవ్రమైన అనారోగ్యం ఉన్న సందర్భంలో మాత్రమే ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఎంఎన్వో (Male Nursing Orderly)ని సహాయంగా నియమిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేమని వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో 29న జరిగే విచారణ తర్వాతే బెయిల్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసులో నిధుల లావాదేవీలు, రాజకీయ సంబంధాలపై దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications