జగన్‌లో సోనియా జైలు భయం ఉంచారు: మందకృష్ణ

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో భాగంగానే జగన్‌ను బెయిల్ పైన బయటకు తీసుకు వచ్చారని ఆరోపించారు. సిబిఐ కేసులో ఇరుక్కుంటే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. జగన్‌ను సోనియా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు.
లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌కు జీవితకాల శిక్ష పడాల్సిందేనన్నారు. ఈ నెల ఆరవ తేదిన గుంటూరులో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. జగన్ ఎప్పటికైనా కాంగ్రెసు పంజరంలోని చిలుకే అన్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓట్లు పడకుంటా సీమాంధ్రలో జగన్‌ను సమైక్యవాదం పేరుతో నడిపిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లే: గండ్ర
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వైయస్ జగన్ సమైక్య శంఖారావం పేరుతో సభను నిర్వహిస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభను నిర్వహించవద్దని కోరారు.












Click it and Unblock the Notifications