వైసీపీ మాట్లాడినా- టీడీపీ నోరెత్తలేదు.. బయటపెట్టిన జైరాం రమేష్..!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. ఇందులో పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీల వారీగా ప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పారు. అయితే ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా చర్చించారు.

ఇవాళ జరిగిన అఖిలపక్ష భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ, బీహార్ కు ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ ప్రతినిధులు కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఏపీతో పాటు కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా గురించి అడగలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. డిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా అడుగుతున్నట్లు చెప్పుకుంటూ కీలకమైన అఖిలపక్ష భేటీలో టీడీపీ మాట్లాడకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Jairam Ramesh reveals tdp silent on ap special status while ysrcp demands in all party meet

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం టీడీపీకి ఇదే ప్రశ్న వేసారు. ఇవాళ అఖిలపక్ష భేటీకి వైసీపీ ప్రతినిధిగా హాజరైన సాయిరెడ్డి.. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ.. టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు కనిపిస్తోందని భేటీ అనంతరం వెల్లడించారు. తాము మాత్రం రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు అఖిలపక్ష భేటీ తర్వాత మాట్లాడిిన టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు సైతం తాము అమరావతి రాజధాని, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా పలు రాష్ట్ర ప్రాజెక్టులపై మాట్లాడినట్లు వెల్లడించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న విధ్వంసం, ఆర్ధిక ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎంపీ కూడా ఎక్కడా చెప్పలేదు. దీంతో టీడీపీ అఖిలపక్ష భేటీలో హోదాపై ఎందుకు మాట్లాడలేదన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+