జల్లికట్టు నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలి, నన్ను కదిలించారు: ఏపీ నేతలపై పవన్ డౌట్
జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు.
విజయవాడ: జల్లికట్టు కోసం చేసిన ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలని, అది ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల ఉద్యమ స్ఫూర్తి తనను కదిలించిందని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు ట్వీట్ చేశారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం అన్నారు. జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాలన్నారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని చెప్పారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించకుంటే అతటా ఇలాంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తమిళుల పోరాట పటిమ ఈ ఉద్యమం ద్వారా ప్రతిబింబించిందన్నారు. కులమతాలకు అతీతంగా తమిళులు అంతా ఏకమై జల్లికట్టు కోసం నినదించటం స్ఫూర్తిదాయకం అన్నారు.

లక్షలాది మంది మెరీనా బీచ్ వద్దకు వచ్చి ఉద్యమించినా, నిరసనలు చేపట్టినా ఎక్కడా అసాంఘిక ఘటనలు చోటు చేసుకోలేదని, ఇది చాలా సంతోషకరమన్నారు. తమిళుల అహింసాయుద పద్ధతి, పోరాటం, సంఘటిత శక్తి తనను కదిలించాయన్నారు.
మన నేతలు కూడా ఇలాంటి సంఘీభావం ప్రదర్శించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఉద్యమాన్ని, ఏపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ నేతలు రాజీపడ్డా ప్రజలు రాజీపడరనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీకి హోదా సాధించాలన్నారు. అయితే, వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్దత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్ఫూర్తి పొందుతారనే దాని పైన తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేతలు రాజీపడినా, ప్రజలు రాజీపడరని తన నమ్మకం అన్నారు. చివర్లో జైహింద్ అని రాశారు. తెలుగులో, ఇంగ్లీషులో ట్వీట్ చేశారు.
# Jallikattu #Kodipandem #AP Special Category Status pic.twitter.com/XaocXn7k0t
— Pawan Kalyan (@PawanKalyan) January 21, 2017












Click it and Unblock the Notifications